Surekha Vani : బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీమ టపాకాయ్, పవర్, సరైనోడు, నేల టిక్కెట్టు, రామారావు ఆన్ డ్యూటీ వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భర్త మరణం తర్వాత సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూ ఉంది సురేఖ వాణి.
సోషల్ మీడియాలో సురేఖ వాణికి ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. కూతురు సుప్రీతతో సురేఖ వాణి చేసే సందడి నెటిజన్లను సైతం ఎంతగానో ఆకర్షిస్తుంది. తల్లీకూతుళ్లు కలిసి చేసే డాన్స్ వీడియోలు కూడా నెటిజన్లను ఫిదా చేసేస్తాయి. కొన్ని సందర్భాలలో వీరిద్దరి వస్త్రధారణ వివాదాస్పద వ్యాఖ్యలకు దారి తీస్తుంటుంది. తల్లికూతుళ్లు సోషల్ మీడియాలో చేసే హడావిడికి ఎవరైనా నెగెటివ్ కామెంట్ పెడితే వారిపై కౌంటర్ల వర్షం కురిపిస్తారు.
ప్రస్తుతం సురేఖవాణి గురించి ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు మోడ్రన్ డ్రెస్ లతో సందడి చేయడం, కలిసి పబ్బులు పార్టీలకు వెళుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రకరకాల డ్రెస్ లతో ఫుల్ రిచ్ గా మెయిటేన్ చేస్తుంటుంది సురేఖా వాణి. ఇలా రిచ్ గా మెయింటెన్ చేయడం ద్వారా సురేఖవాణి ఎంత ఆస్తి వెనకేసి ఉంటుంది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే సురేఖవాణి భారీగానే ఆస్తులు సంపాదించిందని తెలుస్తోంది. ఇక సురేఖవాణి ఈ రేంజ్ లో రిచ్ గా మెయిన్ టెయిన్ చేయడానికి కారణం సినిమాల ద్వారా రూ.10 కోట్లు వరకు సంపాదించడమేనట. సురేఖవాణి ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. సురేఖ వాణికి సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ ఉండటంతో సినిమాలకు ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియా ప్రమోషన్స్ తో కూడా వీళ్ళకి అధిక ఆదాయం చేకూరుతుందట. ఎక్కువ సినిమాలు చేయకపోయినా వచ్చిన ఆఫర్లతో సంతృప్తి చెందుతూ, ఉన్న ఆస్తితో ఇప్పటివరకు తను కోల్పోయిన లైఫ్ ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుందట సురేఖ వాణి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…