సూప‌ర్ స్టార్ కృష్ణ మూవీలు ఒకే ఏడాదిలో 18 వ‌రుస‌గా రిలీజ్ అయ్యాయి.. ఏవి హిట్ అయ్యాయంటే..?

సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. ఆయనే మన డేరింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1965 లో తేనెమనసులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలు సెన్సేషనల్ హిట్ గా నిలిచేవి. తెలుగుతెరకు తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ. ఈస్ట్ మన్ కలర్ ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అందుకే ఈయనను నంబర్ వన్ హీరో అని పిలుస్తారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద హీరోలను ఢీ కొడుతూ ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించేవి. తెలుగు ఇండస్ట్రీకీ మూల స్తంభంగా నిలిచిన వారిలో కృష్ణ కూడా ఒకరు.  కృష్ణ 1943 మే 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. 20 ఏళ్ల వయసులో నటనపై మక్కువతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. దాదాపుగా 350 చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కృష్ణ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.

ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడం కష్టంగా ఉంది. కానీ కృష్ణ ఒకే సంవత్సరంలో 18 చిత్రాలలో నటించిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఉండేది కృష్ణ కమిట్‌మెంట్‌ ఆ రోజుల్లో. ఆ రోజుల్లో కేవలం ఇండోర్ షూటింగ్ లే ఎక్కువగా ఉండేవి. దాదాపు చిత్రాలు మొత్తం స్టూడియోల‌లోనే సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేసేవారు. అందుకే హీరోలు షిఫ్ట్ ప్రకారం ఒక చిత్రం తర్వాత ఒకటి నటిస్తూ పారితోషకం అందుకునేవారు.

1972లో కృష్ణ నటించిన 18 చిత్రాలు ఏకంగా ఒకే సంవత్సరం విడుదల అవడం విశేషం. రాజమహల్ (HIT), మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (HIT), అంతా మనమంచికే (Super Hit), గూడుపుఠాని (Flop), మా ఊరి మొనగాళ్ళు (Super Hit), మేన కోడలు (Average), కోడలు పిల్ల (Average), భలే మోసగాడు(Super Hit), పండంటికాపురం (Block Buster), హంతకులు దేవాంతకులు (Super Hit), నిజం నిరూపిస్తా (Flop), అబ్బాయిగారు అమ్మాయిగారు (Super Hit), ఇన్‌స్పెక్టర్ భార్య (Average), మా ఇంటి వెలుగు (Average), ప్రజా నాయకుడు (Super Hit), మరపురాని తల్లి (Super Hit), ఇల్లు ఇల్లాలు (Super Hit), కత్తుల రత్తయ్య (Super Hit) వంటి సినిమాలు ఒకే ఏడాది వరుస పెట్టి విడుదల చేయడం విశేషం.

ఈ ఘనత ఒక కృష్ణకే దక్కింది. విడుదలైన ఈ సినిమాల‌లో దాదాపుగా 80 శాతం హిట్ అయ్యాయి. ప్రేక్షకులు కూడా వరుసగా విడుదలైన కృష్ణ చిత్రాల‌ను ఆదరించడం కూడా ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటి హీరోలు పాన్ ఇండియా చిత్రాలు అంటూ ఒక సినిమానే సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటే,  కృష్ణ అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాల‌ను విడుదల చేశారు. K.S.R దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మళ‌యాళం, బెంగాలీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అవడంతోపాటు హాలీవుడ్ లో కూడా విడుదలైంది.

రష్యన్, స్పానిష్ వంటి భాషల్లో కూడా విడుదలైన టాలీవుడ్  మొదటి చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ప్రపంచంలో అత్యధిక భాషల్లో విడుదలైన భారత చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు ఆ రోజుల్లో  ప్రభంజనం సృష్టించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM