Sunny Leone : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో అడుగు పెట్టి రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్లు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా నటి సన్నీలియోన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇదివరకు ఏ భారతీయ నటి చేయని వ్యాపారంలోకి అడుగు పెడుతూ.. ఈ వ్యాపారాన్ని చేస్తున్న మొట్టమొదటి భారతీయ నటిగా సన్నిలియోన్ పేరు సంపాదించుకున్నారు. మరి ఈమె చేస్తున్న వ్యాపారం ఏంటి అనే విషయానికి వస్తే..
ఎన్‌ఎఫ్‌టీ అనే ఒక డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ వ్యాపారంలోకి ప్రముఖ హీరోలైన అమితాబచ్చన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ వంటి వారు అడుగు పెట్టారు. ఇందులో భాగంగా వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సినిమాలకు సంబంధించిన విషయాలను డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చి వేలం వేస్తారు. అయితే ఈ వ్యవహారం మొత్తం బ్లాక్ ఛైన్ టెక్నాలజీ ఆధారంగా కొనసాగుతుంది.
ఇలా వేలం వేసిన వీటిని ఎవరైనా కొనుగోలు చేసి తర్వాత వాటిని మరొకసారి వేలం వేసుకోవచ్చు. అయితే ఇలా వేలం జరిగిన ప్రతిసారీ వచ్చే ఆదాయంలో 10 శాతం ఎన్‌ఎఫ్‌టీ క్రియేటర్లకు వాటాగా వెళుతుంది. తాజాగా ఇలాంటి వ్యాపారంలోకి నటి సన్నీలియోన్ అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సన్నీ లియోన్ స్పందిస్తూ మిస్ ఫిట్జ్ పేరుతో తన ఎన్‌ఎఫ్‌టీ వివరాలను సోషల్ మీడియాలో తెలియజేస్తూ తనని కలవండి, తనకు గులాబీ రంగు, టాటూలు వేయించుకున్న అబ్బాయిలు అంటే ఎంతో ఇష్టం అంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఏది ఏమైనా ఇలాంటి వ్యాపారంలోకి అడుగు పెట్టిన మొట్టమొదటి భారతీయ నటిగా సన్నీ లియోన్ గుర్తింపు సంపాదించుకుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…