Suhana Khan : సెలబ్రిటీలు అన్నాక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వారిపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక స్టార్ హీరోల పిల్లలు అంటేనే ట్రోలింగ్ ఇంకాస్త ఎక్కువగానే జరుగుతుంటుంది. అలాంటడప్పుడు వారు బహిరంగ ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మిస్టేక్ చేసినా జనాలకు దొరికిపోతారు. దీంతో ట్రోలింగ్ మరింత ఎక్కువవుతుంది. సరిగ్గా సుహానా ఖాన్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. వచ్చే ఏడాది ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈమె తాజాగా ఓ చోట బయట కనిపించింది. దీంతో ఆమెతో ఫొటోలు దిగేందుకు కొందరు ఫ్యాన్స్ ఎగబడ్డారు. సుహానా.. అంటూ పిలిచారు. కానీ ఆమె వారిని అసలు పట్టించుకోలేదు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. దీంతో సుహానా ఖాన్ వైఖరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంత పొగరు ఎందుకని ఆమెను ప్రశ్నిస్తున్నారు.
కాగా సుహాన్ ఖాన్‌కు చెందిన ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఫ్యాన్స్ ఫొటోలు అడిగితే అంత పొగరు ఎందుకు సుహానా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇక సుహానా ఖాన్ ప్రస్తుతం ది ఆర్చీస్ అనే మూవీలో నటిస్తోంది. దీనికి జోయా అక్తర్ దర్వకత్వం వహిస్తుండగా.. రీమా కాట్గి సహ నిర్మాతగా ఉన్నారు. టైగర్ బేబీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాణమవుతున్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…