Sudigali Sudheer : ర‌ష్మిగౌత‌మ్‌పై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. కార‌ణం..?

May 19, 2022 2:41 PM

Sudigali Sudheer : జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై ర‌ష్మి గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్ జంట‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్ద‌రూ క‌ల‌సి ఒక స్కిట్‌లో న‌టించారు అంటే ఈల‌లు ప‌డాల్సిందే.. చ‌ప్ప‌ట్లు మోగాల్సిందే.. నువ్వుల విర‌బూయాల్సిందే.. అంత‌లా వీరి జంట పాపుల‌ర్ అయింది. వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుందని వీరే స్కిట్‌ల‌లో చెబుతుంటారు. అయితే వాస్త‌వానికి రియ‌ల్ లైఫ్‌లో అలాంటిదేమీ లేదు. కేవ‌లం షోల కోసం వీరిద్ద‌రూ అలా చేస్తుంటారు. ఈ విష‌యాన్ని వీరు వేర్వేరుగా గ‌తంలోనే తెలియ‌జేశారు. అయితే షో విష‌యాల‌ను పక్క‌న పెడితే ర‌ష్మి, సుధీర్ మంచి ఫ్రెండ్స్‌. వీరు బ‌య‌ట కూడా చాలా చ‌నువుగా ఉంటారు. కానీ ఓ కార‌ణం వ‌ల్ల ప్ర‌స్తుతం సుధీర్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఆ కార‌ణం ఏమిటంటే..

కేవ‌లం టీవీ షోల‌ల‌నే కాదు.. ర‌ష్మి గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్‌లు బ‌య‌ట లైఫ్‌లోనూ చ‌నువుగా ఉంటారు. అన్యోన్య‌మైన ఫ్రెండ్ షిప్ వారి మ‌ధ్య ఉంది. అయితే సాధార‌ణంగా ఫ్రెండ్స్ అంటే ఒక‌రి బ‌ర్త్ డే మ‌రొక‌రికి తెలుస్తుంది. దీంతో బ‌ర్త్ డే రోజు విషెస్ చెబుతారు. కొంద‌రు అర్థ‌రాత్రి పూటే త‌మ స్నేహితుల‌తో కేక్ క‌ట్ చేయించి బ‌ర్త్ డేల‌ను సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే గురువారం సుధీర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఎంతో మంది ఆయ‌న‌కు విషెస్ చెప్పారు. ఫ్యాన్స్ కూడా శుభాకాంక్ష‌లు తెలియజేశారు. కానీ ఎంతో చ‌నువుగా ఉండే ర‌ష్మి మాత్రం క‌నీసం సోష‌ల్ మీడియా వేదిక‌గా అయినా స‌రే.. సుడిగాలి సుధీర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఒక్క పోస్ట్ కూడా పెట్ట‌లేదు. పైగా ఆమె సోష‌ల్ ఖాతాల్లో గురువారం ఏవో పోస్టులు పెట్టింది. అంటే.. ఆమెకు సుధీర్ బ‌ర్త్ డే గురించి ముందుగానే తెలుస‌ని.. అయిన‌ప్ప‌టికీ ఆమె బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌లేద‌ని.. సుధీర్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Sudigali Sudheer fans angry on Rashmi Gautam
Sudigali Sudheer

ఇక సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను లు జ‌బ‌ర్ద‌స్త్ షోలో క‌నిపించ‌డం లేదు. దీంతో వీరు మ‌ల్లెమాల‌కు గుడ్ బై చెప్పారా.. నాగ‌బాబు షోలో పాల్గొంటున్నారా.. అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావ‌ల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now