Sudigali Sudheer : ఛానల్ ఏదైనా.. తగ్గేదే లే.. అంటున్న సుధీర్ – రష్మీ జోడి !

March 12, 2022 8:45 PM

Sudigali Sudheer : జబర్దస్త్ ద్వారాఎంతో పాపులారిటీ దక్కించుకున్న సుడిగాలి సుధీర్, రష్మి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియా వేదికగా సుధీర్, రష్మీ జంటకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. వీరి జంటకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణ సంస్థలు వీరితో స్పెషల్ ఈవెంట్ లను చేయడానికి పోటీ పడుతుంటాయి.

Sudigali Sudheer and Rashmi mesmerized in other television channel show
Sudigali Sudheer

అయితే ఈ మధ్య కాలంలో మల్లెమాల సంస్థ సుడిగాలి సుదీర్ ను కాస్త దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈటీవీ ఏ పండుగ వచ్చినా కూడా ఒక స్పెషల్ ఈవెంట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే హోలీ పండుగ రావడంతో రంగ్ దే అనే కార్యక్రమం ద్వారా మల్లెమాల మరో ఈవెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ఇందులో సుడిగాలి సుధీర్ కనిపించకపోవడంతో అభిమానులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ కార్యక్రమానికి పోటీగా స్టార్ మా సరికొత్త ఈవెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రవి, రష్మీ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్.. రష్మీతో కలిసి ప్రేమ, హావభావాలను ప్రదర్శించాడు. ముఖ్యంగా సుధీర్, రష్మీ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎంతో హైలెట్ అయిందనే చెప్పాలి.

ఇక సుధీర్, రష్మి ఎక్కడ ఉన్నా వీరిమధ్య కెమిస్ట్రీ ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులను సందడి చేయడానికి ముందు ఉంటారని చెప్పడంలో సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు. ఇలా వీరిద్దరూ మొదటిసారిగా స్టార్ మా ఈవెంట్ లో కలిసి సందడి చేయడంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now