Sudheer : జ‌బ‌ర్ధ‌స్త్ నుండి సుధీర్ ఔట్..? మ‌రి కొంద‌రు కూడా..?

November 13, 2021 6:51 PM

Sudheer : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్. కొన్ని సంవత్సరాలుగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. చాలా మందిని స్టార్స్‌ని చేసింది. జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ల్ల చాలా మంది లైఫ్‌లో సెటిల్ కావ‌డ‌మే కాకుండా స్టార్స్‌గా మారారు. అలా ఎదిగిన వారిలో సుడిగాలి సుధీర్ ఒక‌రు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకు రాబోతున్నాడట.

Sudheer may be coming out from jabardasth

సినిమాలలో అవకాశాలు వస్తుండడంతో డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోవ‌డం వ‌ల‌న జ‌బ‌ర్ధ‌స్త్ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. అయితే సుధీర్ బ‌య‌ట‌కు వ‌స్తున్నాడు కాబ‌ట్టి రామ్ ప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీను కూడా ప్రోగ్రామ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని అనుకుంటున్నట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్దస్త్. అందులో ఉన్న కమెడియన్స్ అందరికీ సినిమా వాళ్లతో సమానమైన క్రేజ్ వచ్చింది. బయట వాళ్లకు ఈవెంట్స్ కూడా అలాగే వస్తున్నాయి. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో నుంచి కోట్లు సంపాదిస్తున్న నటులు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్‌లో చిన్న కమెడియన్‌గా వచ్చి.. ఈ రోజు పెద్ద వృక్షంలా మారిపోయాడు సుధీర్. ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా సుధీర్ చ‌క్రం తిప్పుతున్నాడు. అయితే సుధీర్‌ నిజంగానే జబర్దస్త్‌ నుంచి తప్పుకుంటున్నాడా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now