Sudheer : మ‌ల్లెమాల సంస్థ‌లోకి మ‌ళ్లీ అన‌సూయ‌, సుధీర్ ఎంట్రీ.. ఇదెక్క‌డి ట్విస్ట్‌రా బాబూ..!

August 19, 2022 12:08 PM

Sudheer : తెలుగు టెలివిజన్ హిస్టరీలో ఈటీవీకి ప్రత్యేక స్థానముంది. ఎన్నెన్నో షోలు, ఎన్నెన్నో సీరియళ్లు నిర్మించి సంచలనాలు సృష్టించింది. బుల్లితెరపై ఏదైనా కొత్త షో చేయాలన్నా.. ప్రయోగాలు చేయాలన్నా ఈటీవీ ముందుంటుంది. అందులో మల్లెమాల అయితే మరింత దూకుడుగా ఉంటుంది. తాజాగా జబర్దస్త్ షో వివాదాల మధ్య తాజాగా భలే మంచి రోజు ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఈటీవీ 27వ వసంతంలోకి అడుగుపెట్టేసింది. ఇందుకోసం మల్లెమాల స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఇందులో మల్లెమాల ఎన్నెన్నో చమక్కులు, ట్విస్టులు ఇచ్చింది.

ఈటీవీ వల్ల లబ్ది పొందిన వారిని అందరినీ పిలిచినట్టు కనిపిస్తోంది. ఇక మల్లెమాలను వీడిపోయిన ఎంతోమంది మళ్లీ ఈ ఈవెంట్‌కు వచ్చినట్టు కనిపిస్తోంది. జబర్దస్త్ లో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన నాగబాబు ఈ షోను వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక కమెడియన్స్ గా మంచి గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, యాంకర్ అనసూయ వీళ్లంతా జబర్దస్త్ నుండి బయటికి రావటంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. పైగా వీళ్ళు జబర్దస్త్ మానేసిన తర్వాత అందరూ నేరుగా స్టార్ మా లో ప్రసారమవుతున్న షో లలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు.

Sudheer and Anasuya entry into Mallemala what is this plan
Sudheer

మరి వీళ్ళు ఎందుకు వెళ్లిపోయారు అని ప్రశ్నలు ఎదురవటంతో వీళ్లకు సినిమాలలో అవకాశాలు రావడంతో వెళ్లిపోయార‌ని తెలిపారు. ఇటీవలే అనసూయ జబర్దస్త్ షోపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తను ఆ షోలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను అని అందుకే ఆ షో నుండి బయటికి వచ్చాను అని అనటంతో అందరూ తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా పక్కన పెడితే మళ్ళీ మల్లెమాలలోకి అడుగు పెట్టారు సుధీర్, అనసూయ. తాజాగా ఈటీవీ 27 సంవత్సరాల సందర్భంగా భలే మంచి రోజు అని ఈవెంట్ నిర్వహించారు.

ఇక దానికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. అందులో పలువురు సెలబ్రెటీలతోపాటు సీరియల్ నటీనటులు కూడా పాల్గొన్నారు. ఇక సుధీర్ ఇలా మళ్లీ మల్లెమాల ఈవెంట్‌లో కనిపించడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. కింగ్ ఈజ్ బ్యాక్, అన్నొచ్చిండు అంటూ ఫ్యాన్స్ యూట్యూబ్‌లో సందడి చేస్తున్నారు. అనసూయ ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఇక చమ్మక్ చంద్ర, సత్య శ్రీల స్పెషల్ పర్ఫామెన్స్ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. అయితే ఇది కేవ‌లం ఈవెంట్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మా.. మ‌ళ్లీ మ‌ల్లెమ‌లా షోల‌లో వీరు పాల్గొంటారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now