Thaman : థ‌మ‌న్ ట్వీట్ నానిని ఉద్దేశించేనా.. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వేంటి ?

December 31, 2021 8:18 AM

Thaman : నేచుర‌ల్ స్టార్ నాని రీసెంట్‌గా శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నాని చేసిన కొన్ని కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఏపీ టిక్కెట్ల వ్య‌వహారంపై ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. ఇక ఓ ఇంటర్వ్యూలో నటులు, టెక్నీషియన్స్ ఎవరూ సినిమాను డామినేట్ చేయకూడదని అన్నారు.

Thaman tweet is it about nani what is quarrel between them

అంతే కాదు సంగీతం కానీ వేరే ఏదైనా క్రాఫ్ట్ కానీ ఫిల్మ్‌తో కలిసి ముందుకు సాగినపుడే ఆ సినిమా హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి నానికి చెందిన అంతకు ముందు మూవీ టక్‌ జగదీష్‌ ఓటీటీలో విడుదలై ప్లాఫ్ అయింది. ఈ మూవీకి థమన్ సంగీత దర్శకుడు. అత‌డిని గోపీ సుంద‌ర్‌తో రీప్లేస్ చేశారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు నానికి వ్య‌తిరేకంగానే థ‌మ‌న్ ట్వీట్ చేసిన‌ట్టు ప్రచారం న‌డుస్తోంది.

అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్‌ దేనినీ డామినేట్‌ చేయదని వరుస ట్వీట్లు చేశాడు థ‌మ‌న్. దీంతో ఈ వ్యాఖ్యలు నానిని ఉద్దేశించినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా అఖండ సినిమాకు బీజీఎం మెయిన్‌ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థ‌మన్ ‘భీమ్లా నాయక్’, సర్కారు వారి పాట, RC 15, గని లాంటి క్రేజీ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now