SS Rajamouli : ఎన్టీఆర్, ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌ల‌లో ఎవ‌రు బెస్ట్ అనేది చెప్పిన రాజ‌మౌళి..!

October 31, 2021 9:37 PM

SS Rajamouli : బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈ ద‌ర్శ‌కుడి సినిమాలంటే ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ నెల‌కొని ఉంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ సినిమాని జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌మౌళి త‌న సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్యక్ర‌మాలతో బిజీ అయ్యారు. ఓ వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతూనే మ‌రోవైపు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు.

SS Rajamouli told who is best in ram charan prabhas and ntr

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రాజ‌మౌళితోపాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇంకా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రుల‌తో ఈ సినిమాను రూపొందించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే రాజ‌మౌళి ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు అయిన ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. ఈ ముగ్గురితో మీరు ప‌నిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవ‌రికీ ఓటేస్తారు? అని ప్ర‌శ్నించ‌గా, దానికి స్ట‌న్నింగ్ స‌మాధానం చెప్పారు.

‘ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రుంటారు. సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే నాకు జంతువులు అంటే పిచ్చి. ఆ జంతువులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి. వాటి గురించి తెలుసుకోవ‌డానికి రామ్‌చ‌ర‌ణ్‌తో గంట‌ల స‌మ‌యం వెచ్చిస్తాను. పుడ్ గురించి మాట్లాడాలంటే ప్ర‌భాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తాను’’ అని అన్నారు రాజ‌మౌళి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now