Srikanth : జగపతిబాబు బాటలోనే శ్రీకాంత్ పయనం.. అదే స్థాయిలో విజయం సాధిస్తారా ?

November 15, 2021 9:30 PM

Srikanth : ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జగపతిబాబు ఒకరు. ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత హీరోగా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమా ద్వారా జితేంద్ర అనే పాత్రలో విలన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Srikanth acting in villain role will he succeed like jagapathi babu

లెజెండ్ సినిమా తర్వాత జగపతిబాబుకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన హీరోగా కంటే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ఇక ఈయన మాదిరిగానే ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ కూడా జగపతిబాబు బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ తాజాగా విలన్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ విలన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆయన పాత్ర ఏంటి.. అనే విషయం ఎవరికీ తెలియక పోయినప్పటికీ తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్ లో శ్రీకాంత్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఒక గొప్ప విలన్ గా సక్సెస్ అవుతారా.. జగపతిబాబులాగే విలన్‌ క్యారెక్టర్లు ఆయనకు వస్తాయా.. వాటిల్లో ఆయన నటిస్తారా.. అన్న వివరాలు వేచి చూస్తే తెలుస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now