Sri Reddy : పూరీ జ‌గ‌న్నాథ్‌పై శ్రీ‌రెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు.. అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాల‌కు అంత బిల్డ‌ప్ అవ‌స‌ర‌మా.. అని ప్ర‌శ్న‌..

August 26, 2022 9:56 PM

Sri Reddy : టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్, మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. ఎలాంటి హీరో అయినా పూరీ చేతిలో పడితే ఆటం బాంబ్ లా మారిపోతాడు. సిల్వర్ స్క్రీన్ పై డైరెక్టర్ పేరు పడితే విజిల్స్ పడేది ఒక్క పూరీకి మాత్రమే. పూరీ సినిమాలో హీరో చెప్పే ఒక్కో డైలాగ్ ను యూత్ అంతా ఓన్ చేసుకొని మన గురించే రాశాడురా అని ఫీల్ అవుతారు. హీరోకి ఏ మాత్రం తగ్గని కట్ ఔట్స్‌ థియేటర్ల ముందు దర్శనిమిస్తాయి. ఈ స్టార్ డైరెక్ట‌ర్‌తో సినిమాలు చేయాల‌ని ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రూ క్యూ క‌ట్టారు. కానీ ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి ఒక్క సినిమాతో తారు మారైంది. ఆ సినిమానే లైగ‌ర్. రౌడీ హీరో విజ‌య్ దేవ‌రకొండ హీరోగా చేసిన ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో స‌క్సెస్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకోవాల‌నుకున్న పూరీ జ‌గ‌న్నాథ్ ఆశ‌ల‌కు గండి ప‌డింది. ఈ గురువారం విడుద‌లైన లైగ‌ర్ చిత్రం డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది.

లైగర్ మూవీని చూశాక నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్‌, మీమ్స్‌తో విరుచుకు ప‌డుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పాన్ ఇండియా హీరోగా చూడాల‌నుకున్న ఆయ‌న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. డైరెక్టర్ పూరీని నెటిజ‌న్స్ స‌హా విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరైతే బూతులు తిడుతున్నారు. ప్రమోషన్స్ పై పెట్టిన శ్రద్ధ మూవీపై పెట్టుంటే బాగుండని విమర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ్రీరెడ్డి తనదైన శైలిలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై ఘాటు, హాటు కామెంట్స్ చేసింది.

Sri Reddy sensational comments on Puri Jagannadh
Sri Reddy

లైగ‌ర్ మూవీ రిజల్ట్ పై పూరీ జ‌గ‌న్నాథ్‌ను టార్గెట్ చేస్తూ ట్విట్ట‌ర్ వేదిక‌గా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తీసేది ఏమో అట్టర్ ఫ్లాప్ సినిమాలు, మరలా మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వటం లేదు, అని బాబు మీద పడి ఏడవటం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా.. అని ఒక ట్వీట్, లైగర్‌కి ముందు లైగర్ తర్వాత అంట.. అనవసరమైన హైప్ లు అవసరమా, కంటెంట్ వున్నోడికి హైప్ అవసరం లేదు, లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్, బెటర్ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం అంటూ మరో ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. ఆల్రెడీ అనసూయ చేసిన ట్వీట్ కే అనసూయను ఓ ఆటాడుకుంటున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ శ్రీరెడ్డి ట్వీట్ కి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now