Sri Reddy : ఇటీవల జరిగిన పబ్ దాడుల్లో నిహారిక రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ఆమెతోపాటు మెగా ఫ్యామిలీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇష్యూపై యాంకర్, బీజేపీ మహిళా నేత శ్వేతారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మెగా ఫ్యామిలీపైన.. జనసైనికులపైన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో మాట్లాడిన వీడియోను చూపిస్తూ విమర్శలు గుప్పించారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే అందరికంటే ముందుగా ఉండే శ్రీ రెడ్డి పచ్చి బూతులతో విరచుకుపడింది. కర్మ ఎవర్నీ వదిలిపెట్టడదని.. తనని ఏడిపించిన నాగబాబు, పవన్ కళ్యాణ్ అంతకి మించే అనుభవిస్తారంటూ నోటికి పనిచెప్పింది శ్రీరెడ్డి.
శ్రీరెడ్డి మాట్లాడుతూ.. నాగబాబూ.. కర్మ అనేది చూశావారా ? నువ్ నన్ను ఎంత టార్గెట్ చేశావ్ రా.. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టావ్.. యూట్యూబ్ ఛానల్స్‌లో ఎంత తిట్టావ్.. ఎంత టార్గెట్ చేశావ్.. ఒక ఆడపిల్లని అని చూడకుండా నాతో ఎంత ఆడుకున్నావో.. నిన్ను శ్రీరెడ్డి ఏమీ చేయలేకపోయింది. కానీ కర్మ అనేది నిన్ను వదిలి పెట్టలేదు.. వెంటాడింది. ప్రకృతి నీకు తిరిగి ఇచ్చేస్తుంది. అరేయ్ స్నేక్ బాబూ.. నేను శక్తిని కాకపోవచ్చు కానీ.. నేను పూజించేది శక్తినే. మీ అమ్మాయి వీర మహిళ అని చెప్పి.. మా బాబాయ్‌కి ఓటు వేయండి అని అన్నది.. అంటే వీర మహిళలు చేసే తతంగాలు ఇలా ఉంటాయా ?
పబ్‌లకు వెళ్లడం తప్పని నేను అనడం లేదు.. కానీ మూడు గంటల రాత్రి పూట వెళ్తారా ? అది కూడా ఉగాది రోజు పక్కన భర్త లేకుండా వెళ్తుందా.. మా వైసీపీ వాళ్లని కించపరుస్తూ మాట్లాడావ్ కదా.. మరి ఇప్పుడు ఏమంటావ్.. మీ వీర మహిళల సంగతి ఏంటి ? మా ఇంట్లో ఆడపిల్లలు అలాంటి వాళ్లు ఇలాంటి వాళ్లు పైనుంచి దిగొచ్చారని చెప్పే కళ్యాణాల పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు. మీ అన్నయ్య బిగ్ బాస్ స్టేజ్‌పై ఓ ట్రాన్స్ జెండర్‌తో నన్ను ఎలా తట్టించాడో చూశాం. అసలు మీ పెంపకాలు ఏంట్రా ?
నాగబాబూ ఆ పిల్లది కాదు తప్పు.. పెంపకానిది తప్పు. మా పెంపకాలు గొప్పవని మేం అనడం లేదు.. అందుకే మా బతుకు ఇలా తగలడింది. తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమవుతారో మాకు తెలిసి వచ్చింది. కానీ నువ్ నీతులు చెప్తావ్ కదా.. మరి నీ కూతుర్ని ఏంటి ఇలా పెంచావ్.. మా గురించి కామెంట్లు చేస్తావ్ కదా.. ఈరోజు నీ పరిస్థితి ఏంటి ? సీతాదేవితో పోల్చుతూ వీడియోలు పెట్టావ్.. కూతురు పెళ్లి అప్పుడు.. సీతాదేవి అర్ధరాత్రి పబ్‌కి వెళ్తుందా ? పక్కన మొగుడు లేకుండా పోతుందా ?
ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉందో.. ఇంట్లో అమ్మాయిలకు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ల పేరెంట్స్ ఎంత బాధపడతారో తెలిసిందా ? ఈరోజు మీకు తెలిసి వచ్చిందా ? ఇది శాంపిల్ మాత్రమే నాగబాబూ.. ఇంకా ఇంకా అనుభవిస్తావు.. నన్ను ఎంతలా తిట్టించావు.. నన్ను రాత్రి పూట నిద్ర లేకుండా చేసి మరీ తిట్టారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చివరికి దేవుడి కోర్టులో ఎవరూ తప్పించుకోలేదు. కర్మ అనేది దూల తీర్చేస్తుంది. నాకు అవకాశాలు లేకుండా చేశారు.. చివరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు రాకుండా చేశారు. ఇండస్ట్రీలో పెద్దలుగా ఉన్న వాళ్లు ఏం చేయాలి.. నీ వరకూ వచ్చేసరికి నా కూతురు తప్పులేదని అంటున్నావ్.. మరి మిగిలిన ఆడపిల్లలు అలాంటి వాళ్లు కాదా ? ఇప్పటికైనా మంచి, చెడు ఆలోచించండి.. ఏ అమ్మాయినైనా టార్గెట్ చేసేటప్పుడు.. తిట్టేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోండి.. అంటూ లైవ్‌లో పచ్చిబూతులు తిట్టేసింది శ్రీరెడ్డి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…