Sri Reddy : త‌న‌దైన స్టైల్‌లో ఘాటుగా బోటి కూర వండిన శ్రీ‌రెడ్డి.. వీడియో వైర‌ల్‌..!

July 20, 2022 8:13 PM

Sri Reddy : న‌టి శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. త‌న‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తోంది. అయితే స‌మాజంలోని సంఘ‌ట‌న‌ల‌పై ఈమె ఈమ‌ధ్య పెద్ద‌గా స్పందించ‌డం లేదు. ఇటీవ‌లే నాగ‌బాబు కుమార్తె నిహారిక డ్ర‌గ్స్ కేసు విష‌య‌మై ఈమె చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. త‌రువాత న‌టి క‌ల్యాణి వివాదంపై స్పందించింది. ఆమెకు వార్నింగ్ కూడా ఇచ్చింది. త‌రువాత ఎవ‌రిపై కూడా పెద్ద‌గా కామెంట్స్ చేయ‌లేదు. కానీ త‌న వంట‌ల వీడియోల‌తో మాత్రం అద‌ర‌గొడుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు నాన్ వెజ్ వంట‌కాల‌ను వండుతూ అల‌రిస్తోంది. ఇక తాజాగా మ‌రో వంట‌కంతో శ్రీ‌రెడ్డి నెటిజ‌న్ల ముందుకు వ‌చ్చింది.

శ్రీ‌రెడ్డి త‌న లేటెస్ట్ వీడియోలో బోటికూర వండింది. త‌న‌దైన స్టైల్‌లో డైలాగ్స్ చెబుతూ.. బోటిని క్లీన్ చేసింది. త‌రువాత దాన్ని య‌మ ఘాటుగా వండింది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయ‌గా.. ఇప్ప‌టికే భారీగా వ్యూస్ కూడా వ‌చ్చాయి. ఇక ఈమ‌ధ్య కాలంలో శ్రీ‌రెడ్డి రెస్టారెంట్ల‌కు సైతం వెళ్తోంది. అక్క‌డ వంట‌ల‌ను రుచి చూస్తూ రివ్యూలు కూడా ఇస్తోంది. ఓ రెస్టారెంట్‌కు ఈమె 10 కి 10 మార్కులు ఇవ్వ‌గా.. ఇంకో రెస్టారెంట్‌కు 6 మార్కులే ఇచ్చింది. అలాగే న‌గ‌ల దుకాణానికి వెళ్లి ఇటీవ‌లే భారీగానే బంగారాన్ని కొనుగోలు చేసింది.

Sri Reddy cooked Telangana style boti curry video viral
Sri Reddy

అయితే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఈమెకు అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో చెన్నైకి మ‌కాం మార్చింది. పైగా ప‌వ‌న్ ను ఎప్ప‌టిక‌ప్పుడు తిడుతుండ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ నుంచి త‌న‌కు ముప్పు ఉంద‌ని భావించిన ఆమె చెన్నైలో ఉంటోంది. అక్క‌డి నుంచే వీడియోల‌ను పోస్ట్ చేస్తోంది. ఈ మ‌ధ్యే చెన్నైలోని ఓ యూట్యూబ్ చాన‌ల్‌తో క‌లిసి అర్థ‌రాత్రి ర‌హ‌దారుల‌పై ద్విచ‌క్ర వాహ‌నాల‌ను ఆపి హ‌ల్ చ‌ల్ చేసింది. దీంతో ఆ వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. ఇక లేటెస్ట్‌గా ఈమె పెట్టిన బోటి కూర వీడియో కూడా వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు అద్భుతంగా కూర వండావ‌ని ఆమెను అభినందిస్తున్నారు. ఆ కూర‌ను చూస్తుంటే త‌మ‌కు కూడా తినాల‌ని ఉంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now