Sri Reddy : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రించే వరకు అందరూ అందులోనే విహరిస్తున్నారు. కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సోషల్ మీడియాను ఆదాయ వనరుగా కూడా చేసుకుంటున్నారు. ఇక నటీనటులు కూడా తమ వీడియోలను అందులో పెడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో శ్రీరెడ్డి ముందు ఉంటుందని చెప్పవచ్చు. ఈమె టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది. తరువాత కనిపించకుండా పోయింది. కానీ యూట్యూబ్ ద్వారా మళ్లీ నెటిజన్లను అలరిస్తోంది.
శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. రకరకాల వంటలను వండుతూ అందాల విందు చేస్తూ అలరిస్తోంది. ఇప్పటికే అనేక రకాల వంటలను వండిన శ్రీరెడ్డి తాజాగా కొరమీను చేపలను వండింది. తనదైన శైలిలో పంచ్‌లు విసురుతూ కబుర్లు చెబుతూ చేపలను వండింది. దీంతో ఆమె వండిన కూరను చూస్తుంటే నోట్లో నీళ్లూరుతున్నాయంటే నమ్మండి. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. కానీ దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌పై మాత్రం విమర్శలను ఎక్కు పెడుతోంది.
అభిరామ్ త్వరలోనే తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస అనే మూవీతో మన ముందుకు రానున్నాడు. దీంతో ఆయనపై శ్రీరెడ్డి ప్రస్తుతం సంచలన కామెంట్స్ చేస్తోంది. ఇక ఇటీవలే పవన్ మీద కూడా దారుణంగా విమర్శలు చేస్తూ బూతులు తిట్టేసింది. పవన్ ఓ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. దీంతో పవన్‌ను శ్రీరెడ్డి కూడా అంతే రేంజ్‌లో తిట్టింది. దీంతో ఆమె వీడియో వైరల్ అయింది. కాగా ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటూ యూట్యూబ్‌లో వంటల ద్వారా అలరిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…