Sri Reddy : ఎప్పుడూ వంట చేసే శ్రీ‌రెడ్డి.. ఇప్పుడేంటి.. ఇలా చేసింది..?

June 16, 2022 8:39 PM

Sri Reddy : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు శ్రీ‌రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. అప్ప‌ట్లో ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్య‌మం ద్వారా వార్త‌ల్లో నిలిచింది. ఈ విష‌యం నేష‌న‌ల్ మీడియాలోనూ అప్ప‌ట్లో వ‌చ్చింది. ఆ త‌రువాత అంతా స‌ద్దుమ‌ణిగింది. అయిన‌ప్ప‌టికీ శ్రీ‌రెడ్డి మాత్రం స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌పై స్పందించ‌డం మాన‌డం లేదు. ఇప్పుడు ఈమె ఓ వైపు యూట్యూబ్ చాన‌ల్‌ను నిర్వ‌హిస్తూనే మ‌రోవైపు మ‌న చుట్టూ జ‌రిగే సంఘ‌ట‌నల‌పై స్పందిస్తోంది. ఇక శ్రీ‌రెడ్డి ఈమ‌ధ్య కాలంలో యూట్యూబ్‌లో వంట‌ల వీడియోల‌తో రచ్చ చేస్తోంది.

శ్రీ‌రెడ్డి యూట్యూబ్‌లో ఈ మ‌ధ్య కాలంలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అనేక వంట‌ల‌కు చెందిన వీడియోల‌ను పోస్ట్ చేస్తున్న ఈమె యూట్యూబ్‌లో కూడా బాగా పాపుల‌ర్ అవుతోంది. ఈమె పోస్ట్ చేస్తున్న వంట‌ల వీడియోల‌కు అనేక వ్యూస్ కూడా వ‌స్తున్నాయి. అయితే ఎప్పుడూ వంట‌ల వీడియోల‌ను పోస్ట్ చేసే ఈమె.. లేటెస్ట్‌గా అలాంటి వీడియోను కాకుండా.. తానే రెస్టారెంట్‌కు వెళ్లి స్వ‌యంగా వంట రుచి చూసి అది ఎలా ఉందో చెప్పింది.

Sri Reddy ate food and given review to restaurant
Sri Reddy

ఎల్ల‌ప్పుడూ యూట్యూబ్‌లో వంట‌ల వీడియోల‌తో సంద‌డి చేసే శ్రీ‌రెడ్డి ఈసారి మాత్రం కాస్త వెరైటీగా చేసింది. ఓ రెస్టారెంట్‌కు వెళ్లి అక్క‌డ ఫుడ్‌ను ఆర్డ‌ర్ చేసి బాగా భోజ‌నం చేసిన‌ట్లు చెప్పింది. అయితే ఆ రెస్టారెంట్ ఫుడ్‌కు మాత్రం ఆమె 10 కి 6 మార్కులే ఇస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. అయితే శ్రీ‌రెడ్డి ఎప్పుడూ వంట‌లు చేస్తుంది కానీ ఈసారి కాస్త భిన్నంగా ఫుడ్‌కు రివ్యూ ఇవ్వ‌డంపై నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. ఇక శ్రీ‌రెడ్డి ప్ర‌స్తుతానికైతే వివాదాల‌కు దూరంగా త‌న ప‌నేదో తాను చేసుకుంటూ జీవిస్తోంది. మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

https://youtu.be/6NuHO5loH9U

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now