Abhiram Daggubati : ద‌గ్గుబాటి త‌న‌యుడిని మ‌ళ్లీ టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. వాళ్ళను అలా అనేసిందేంటీ..?

September 17, 2022 7:48 AM

Abhiram Daggubati : టాలీవుడ్ లో వారసులు ఫిల్మ్ ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. తాజాగా టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమయ్యాడు సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్. తేజ దర్శకత్వంలో అభిరామ్ దగ్గుబాటి మొదటి సినిమా తెరకెక్కనుంది. ఈ అభిరామ్ అనే పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. శ్రీ రెడ్డి లవర్ గా ఒకప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి శ్రీరెడ్డి రానాని బావ అని, సురేష్ బాబుని మామ అని ఎన్నో వీడియోల్లో సంబోధించింది. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో మ‌నోడిని మొద‌ట టార్గెట్ చేసి నానా హంగామా సృష్టించింది. దీంతో అభిరామ్ ఒక్క సినిమా చేయ‌కుండానే ఫుల్ పాపుల‌ర్ అయ్యాడు.

అయితే ఇన్నాళ్ల‌కు అభిరామ్.. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇటీవ‌ల చిత్ర ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా ఇది ఆక‌ట్టుకునేలా ఉంది. అయితే ఈ సినిమా మ‌రికొద్ది రోజుల్లో విడుద‌ల కాగానుండ‌గా, శ్రీరెడ్డి త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న కామెంట్స్ చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అభిరామ్‌ని టార్గెట్ చేస్తూ దారుణ‌మైన కామెంట్స్ చేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు సమాచారం.

sri reddy again sensational comments on Abhiram Daggubati
Abhiram Daggubati

ఇటీవ‌ల అభిరామ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడిగా తనకు మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందని మరీ ముఖ్యంగా లవ్ స్టోరీలో మంచి కంటెంట్ తో సహా మెసేజ్ కూడా ఉండాలని ఆయన కోరాడు. ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తన గత జీవితాన్ని ఓపెన్ చేసి చూపించినట్లు జనం ఫీలవుతారని, ఈ సినిమా ద్వారా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలను మార్చుకోవచ్చని చెప్పుకొచ్చాడు అభిరామ్. సినిమా విడుదలకు ముందు అందరి కళ్ళు శ్రీరెడ్డి మీదే ఉంటాయి.. అనడంలో అతిశయోక్తి లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now