Sreesanth : కోహ్లి కెప్టెన్సీలో నేను ఆడి ఉంటే.. ఇండియాకు 3 వ‌రల్డ్ క‌ప్‌లు తెప్పించేవాడిని : శ్రీశాంత్

July 20, 2022 1:56 PM

Sreesanth : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ‌ధ్య కాలంలో బ్యాట్‌తోనూ విఫ‌ల‌మ‌వుతున్నాడు. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేనంత గ‌డ్డు ప‌రిస్థితి కోహ్లికి వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తేడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ నిష్క్ర‌మ‌ణ అనంత‌రం కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. త‌రువాత వ‌న్డే, టెస్టుల్లోనూ అత‌న్ని జ‌ట్టు కెప్టెన్‌గా తొల‌గించారు. త‌రువాత రోహిత్ శ‌ర్మ‌కు మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అయితే కోహ్లిపై తాజాగా మాజీ పేస‌ర్ శ్రీ‌శాంత్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు.

ఓ చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీ‌శాంత్ మాట్లాడుతూ.. కోహ్లి కెప్టెన్సీలో తాను ఆడి ఉంటే భార‌త్‌కు 2015, 2019ల‌లో వ‌న్డే, 2021లో టీ20 మొత్తం 3 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌ను తెప్పించి ఉండే వాడిన‌ని అన్నాడు. దీంతో శ్రీ‌శాంత్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు అత‌ని వ్యాఖ్యల‌పై ట్రోల్ చేస్తున్నారు. ఇక శ్రీ‌శాంత్ ఈమ‌ధ్యే త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లో జీవిత‌కాలం నిషేధం ఎదుర్కొన్న శ్రీ‌శాంత్ సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాటం చేశాడు. దీంతో ఆ పిటిష‌న్‌లో అత‌ను గెలిచాడు. త‌రువాత జ‌ట్టులో చోటు కోసం ఆశించాడు. కానీ బీసీసీఐ అత‌నికి మొండి చేయి చూపించింది.

Sreesanth said India would be lifted 3 world cups if he played under Kohli
Sreesanth

ఇక ఈ మ‌ధ్యే నిర్వ‌హించిన ఐపీఎల్ మెగా వేలంలో కూడా శ్రీ‌శాంత్ పాల్గొన్నాడు. కానీ అత‌న్ని ఎవ‌రూ కొనుగోలు చేయ‌లేదు. దీంతో శ్రీ‌శాంత్ అంత‌ర్జాతీ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లు తెలిపాడు. శ్రీ‌శాంత్ మొత్తంగా త‌న కెరీర్‌లో భార‌త్ త‌ర‌ఫున 27 టెస్టులు, 53 వ‌న్డేలు, 10 టీ20లు ఆడ‌గా.. 2011లో భార‌త్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టుతోపాటు 2007లో ఇండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన జట్టులోనూ అత‌ను స‌భ్యుడిగా ఉన్నాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చివ‌రి బంతికి శ్రీ‌శాంత్ అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టి పాక్‌పై భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు. అందుక‌నే పైవిధంగా అత‌ను కామెంట్స్ చేసి ఉంటాడ‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now