Sreemukhi : వామ్మో.. పైట తీసేసి డ్యాన్స్‌తో ర‌చ్చ చేసిన శ్రీ‌ముఖి.. వీడియో..!

May 13, 2022 3:33 PM

Sreemukhi : బుల్లితెర అందాల యాంక‌ర్ శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఓ వైపు టీవీ షోల‌లోనే కాకుండా.. సినిమాల్లోనూ క‌నిపిస్తూ అల‌రిస్తోంది. టీవీ షోల‌లో ఈమె చేసే అల్ల‌రి మామూలుగా ఉండ‌దు. ఒక రేంజ్‌లో ర‌చ్చ చేస్తుంటుంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ శ్రీ‌ముఖి ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు త‌న ఫొటోలు, వీడియోల‌ను అందులో షేర్ చేస్తుంటుంది. ఇవి వైర‌ల్ అవుతుంటాయి. అందులో భాగంగానే తాజాగా శ్రీ‌ముఖి ఓ పాట‌కు డ్యాన్స్ చేసి ఆ వీడియోను షేర్ చేసింది. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఓ పంజాబీ పాట‌కు ఆమె భాంగ్రా స్టైల్ డ్యాన్స్ చేసి అల‌రించింది.

అలా డ్యాన్స్ చేస్తున్న శ్రీ‌ముఖి ఒక్క‌సారిగా అల‌సిపోయిన‌ట్లు అయింది. దీంతో వెంట‌నే ఇంక త‌న వ‌ల్ల కాదు అన్న‌ట్లుగా ప‌క్క‌నే ఉన్న బెడ్ మీద ప‌డిపోయింది. కాగా శ్రీ‌ముఖికి చెందిన ఈ వీడియోను నెటిజన్లు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు. స‌హ‌జంగానే శ్రీ‌ముఖి యాంక‌ర్ గా గ‌ల‌గ‌లా మాట్లాడ‌డ‌మే కాదు.. డ్యాన్స్‌లు కూడా చేయ‌గ‌ల‌దు. ఈమె ఎక్క‌డ ఉన్నా స‌రే సంద‌డిగా ఉంటుంది. శ్రీ‌ముఖి టీవీ షోల‌లో ఎంతో సంద‌డి చేస్తుంటుంది. తోటి కంటెస్టెంట్ల‌ను ఆట ప‌ట్టిస్తుంటుంది. ఇక శ్రీ‌ముఖికి సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్లు ఎక్కువ‌గానే ఉన్నారు.

Sreemukhi latest dance video for hindi song viral
Sreemukhi

తోటి యాంక‌ర్లు అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నా శ్రీ‌ముఖి మాత్రం చాలా రిజ‌ర్వ్‌డ్‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అవ‌స‌రం అయినంత మేర‌కే గ్లామ‌ర్ షో చేస్తుంటుది. అయిన‌ప్ప‌టికీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింద‌ని కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment