Sreeleela : పెళ్లి సందD భామకు బంపర్ ఆఫర్.. డీజే టిల్లు 2 లో హీరోయిన్‌గా శ్రీ‌లీల‌..?

August 20, 2022 6:36 PM

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన లేటెస్ట్ మూవీ పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో శ్రీలీల‌ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అర‌డ‌జ‌నుకు పైగానే సినిమాలున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుండి మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ కొట్టిన సినిమాల్లో డీజే టీల్లు కూడా ఒక‌టి. ఈ మూవీలో సిద్థు జొన్నలగడ్డ పెర్ఫామెన్స్, మాస్ యాంగిల్ కు లేడీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. కాగా ఈ సీక్వెల్‌లో సిద్ధూకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. మేక‌ర్స్ హీరోయిన్‌గా ప‌లువురు పేర్లు అనుకున్నప్పటికీ చివ‌రికి శ్రీలీల‌ను ఎంపిక చేశార‌ట‌. అయితే ఇందులో ముందుగా హీరోయిన్‌గా అనుప‌మ‌ పరమేశ్వరన్ ను సంప్ర‌దించిన‌ట్లు వార్త‌లు వచ్చాయి.

Sreeleela reportedly got offer in DJ Tillu 2 movie
Sreeleela

ఇప్పుడేమో శ్రీలీల సెలక్ట్ అయ్యిందని న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఏది నిజ‌మో తెలియాలంటే.. అఫిషియల్ గా అనౌన్స్‌మెంట్‌ వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం శ్రీలీల ర‌వితేజ‌తో ధ‌మాకా, నవీన్ పోలిశెట్టితో అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాలో న‌టిస్తోంది. ఇక వైష్ణ‌వ్ తేజ్ నాలుగ‌వ‌ సినిమాలో కూడా శ్రీలీల‌నే హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ఇలా వరుస సినిమాలు చూస్తుంటే.. త్వరలోనే శ్రీలీల టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఆమె ఆ స్థాయికి చేరుకుంటుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now