Sreeja : ఇంకో అమ్మాయితో క‌ల్యాణ్‌దేవ్‌కు సంబంధం..? అందుక‌నే శ్రీ‌జ‌తో విడాకులు..?

Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్‌లు ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. వీరు గ‌త కొంత కాలంగా విడిగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వీరు త్వ‌ర‌లో విడాకులు కూడా తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆల్రెడీ వీరు విడాకులు తీసుకున్నార‌ని.. కానీ ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెబితే ప‌రువు పోతుంద‌ని.. క‌నుక ఆ విష‌యాన్ని గుట్టుగా దాచి ఉంచార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక శ్రీ‌జ‌, క‌ల్యాణ్ గ‌తంలో ఎప్పుడు క‌నిపించినా ఇద్ద‌రూ క‌లిసే ఉండేవారు. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో వారు పెడుతున్న సోష‌ల్ మీడియా పోస్టుల్లో ఇద్ద‌రూ క‌ల‌సి క‌నిపించ‌డం లేదు. వేర్వేరుగానే పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇద్ద‌రూ విడిపోయారనే వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్లు అయింది.

ఇక శ్రీ‌జ చిన్న కుమార్తెకు గ‌తంలో క‌ల్యాణ్ దేవ్ బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు. కానీ పెద్ద కుమార్తెకు మాత్రం విషెస్ చెప్ప‌లేదు. దీంతో ఇద్ద‌రికీ మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని మ‌ళ్లీ వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. అయితే దీనిపై అటు క‌ల్యాణ్ దేవ్ కానీ.. ఇటు మెగా కాంపౌండ్ కానీ స్పందించ‌లేదు. కానీ తాజాగా మ‌ళ్లీ ఇంకో వార్త ప్ర‌చారం అవుతోంది. అదేమింటే.. క‌ల్యాణ్ దేవ్‌కు ఇంకో అమ్మాయితో సంబంధం ఉంద‌ని.. ఆ విష‌యం తెలిసిన శ్రీ‌జ అత‌న్ని దూరం పెట్టింద‌ని.. క‌నుక‌నే ఇద్ద‌రూ విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజం ఎంత ఎంది.. అన్న విష‌యం తెలియ‌దు కానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఇవి బాగా ప్ర‌చారం అవుతున్నాయి.

Sreeja

ఇక గ‌తంలో క‌ల్యాణ్ దేవ్‌పై కూడా ప‌లు రూమ‌ర్స్ వినిపించాయి. మామ చిరంజీవి పేరు చెప్పి ఆయ‌న నిర్మాతలు, ద‌ర్శ‌కుల‌ను ఇంటికి పిలిపించుకుని త‌న‌తో సినిమా చేయాల‌ని వారి బ‌ల‌వంత పెట్టాడ‌ని.. అయితే ఈ విష‌యం తెలిసిన చిరంజీవి క‌ల్యాణ్ దేవ్‌ను మంద‌లించార‌ని.. అందుక‌నే అత‌ను మెగా కాంపౌండ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనిపై క్లారిటీ రాలేదు. ఇక తాజాగా మ‌ళ్లీ క‌ల్యాణ్ దేవ్‌కు ఇంకో అమ్మాయితో సంబంధం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇందులో కూడా నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM