Sreeja Konidela : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈమె గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈమె తన భర్త కల్యాణ్‌దేవ్‌తో విడిపోయిందని ఈమధ్య చాలా వార్తలు వచ్చాయి. సమంతలాగే ఈమె కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేరులో భర్త పేరును తీసేసింది. దీంతో కల్యాణ్ దేవ్‌కు ఈమె విడాకులు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అలాగే ఆ వార్తలకు బలం చేకూరేలా వీరిద్దరూ విడివిడిగా పోస్ట్‌లు పెట్టడం ప్రారంభించారు. గతంలో ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. సోషల్ మీడియాలోనూ వీరు కలిసి ఉన్న ఫొటోలనే షేర్ చేసేవారు. కానీ ఎప్పుడైతే శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ పేరు నుంచి భర్త పేరును తీసేసిందో.. అప్పటి నుంచి ఈమె తన ఫొటోలను తాను పోస్ట్ చేసుకుంటోంది. అలాగే కల్యాణ్ దేవ్ పోస్ట్ చేస్తున్న ఫొటోల్లో కూడా శ్రీజ కనిపించడం లేదు. దీంతో వీరు విడిపోయారనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
ఇక కల్యాణ్ దేవ్ గతంలో తీసిన సినిమాలకు మెగా ఫ్యామిలీ ప్రచారం చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఆయన చిత్రాలను వారు పట్టించుకోలేదు. అలాగే మెగా ఫ్యామిలీ జరుపుకునే వేడుకల్లోనూ కల్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో కల్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారని అందరూ నమ్ముతూ వస్తున్నారు. అయితే మరోవైపు ఈ వార్తలను శ్రీజ, కల్యాణ్ దేవ్ ఇద్దరూ ఖండించలేదు. అలాగే వీరి కుటుంబాలు కూడా ఈ వార్తలపై స్పందించలేదు. అంటే.. వీరు నిజంగానే విడిపోయారని అర్థమవుతోంది. అయితే ఇప్పుడు మళ్లీ ఇంకో వార్త వైరల్ గా మారింది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమవుతుందని తెలుస్తోంది.
చిరంజీవి కుమార్తె శ్రీజ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతుంది.. అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటిలో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియదు కానీ.. కల్యాణ్ దేవ్‌తో విడాకుల ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని.. అధికారికంగా విడాకులు రాగానే శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. అయితే ఈ వివరాలను ఖండిస్తారా.. లేక త్వరలో దీనిపై అధికారికంగా వివరాలను వెల్లడిస్తారా.. అన్న విషయం వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…