Sreeja Konidela : ఒంటరిగా వెకేష‌న్‌కు వెళ్లిన శ్రీ‌జ‌.. క‌ల్యాణ్ దేవ్ ఎక్క‌డ అంటున్న నెటిజ‌న్లు..!

April 27, 2022 11:14 AM

Sreeja Konidela : ఇటీవ‌ల చాలా మంది క‌పుల్స్ చిన్న చిన్న కార‌ణాల‌తో మంచి లైఫ్‌ని నాశనం చేసుకుంటున్నారు. నాగ చైత‌న్య‌, స‌మంత త‌మ వైవాహిక జీవితానికి గ‌త ఏడాది బ్రేక‌ప్ చెప్ప‌గా, ఇప్పుడు శ్రీజ‌-క‌ళ్యాణ్ దేవ్ రిలేష‌న్‌పై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ‌త కొద్ది రోజులుగా శ్రీజ‌- క‌ళ్యాణ్ దేవ్ ఎడ‌మొహం పెడ‌మొహంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత శ్రీజ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజ‌ క‌ళ్యాణ్‌గా మార్చుకుంది. కొన్ని నెల‌లుగా ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌ని, గత ఏడాది జూలై, ఆగస్టులోనే వారు విడిపోయారని వార్త‌లు వ‌చ్చాయి.

Sreeja Konidela lonely in vacation netizen ask where is Kalyan Dhev
Sreeja Konidela

వీరిపై అలా ప్ర‌చారం జ‌ర‌గ‌డం వెనుక కూడా కార‌ణాలు లేక‌పోలేదు. శ్రీజ.. క‌ళ్యాణ్ దేవ్ పేరుని త‌న ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించ‌డమే కాదు.. శ్రీజ‌ కొణిదెల‌గా మార్చుకుంది. ఇన్ స్టాలో క‌ళ్యాణ్ దేవ్ అకౌంట్‌ను అన్ ఫాలో కూడా చేసింది. ఇలా చేయడం ద్వారా.. క‌ళ్యాణ్ దేవ్‌తో విడిపోయిన‌ట్లు ఆమె తన సైడ్ నుంచి పూర్తి క్లారిటీ ఇచ్చేసింద‌నే వార్త‌లు నెట్టింట జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతేకాక క‌ళ్యాణ్ దేవ్ ఇటీవ‌ల మెగా వేడుక‌ల‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

తాజాగా శ్రీజ వెకేషన్ ట్రిప్ వేయ‌గా.. ఆ స‌మ‌యంలో క‌ళ్యాణ్ దేవ్ లేక‌పోవ‌డం అభిమానుల‌లో అనేక ఆలోచ‌న‌ల‌ను రేకెత్తిస్తోంది. తాజాగా తన పిల్లలతో కలిసి తమిళనాడులోని కోటగిరి హిల్స్‌కు వెళ్లి సేద తీరుతోంది శ్రీజ‌. ఇందుకు సంబంధించిన ఫోటోలను నవిష్క ఇన్‌స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ వెకేషన్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన ప్రతి ఒక్కరూ ఇక్క‌డ కూడా క‌ళ్యాణ్ మిస్ అయ్యాడా, ఏం జ‌రుగుతోంది.. అస‌లు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి వీరి విడాకుల విష‌య‌మై త్వ‌ర‌లోనే ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment