Sreeja Konidela : కష్ట, సుఖాల్లో తోడున్నారు.. మీరు లేకపోతే అంటూ.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్..

September 21, 2022 7:58 PM

Sreeja Konidela : మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది శ్రీజ. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న వాల్యూ గురించి అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీలో ఆయన చిన్న కూతురు శ్రీజ ప్రవర్తన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట శ్రీజ తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతనితో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు తీసుకొని తండ్రి వద్దకు చేరింది.

ఆ తరువాత చిరంజీవి ఆమెకు కళ్యాణ్ దేవ్ ను ఇచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ వీళ్ళు విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దీనిపై శ్రీజ కానీ కళ్యాణ్ దేవ్ గానీ స్పందించలేదు. శ్రీజ మాత్రం గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. రామ్ చరణ్ అయితే తనతో పాటే శ్రీజను కూడా తీసుకెళ్తున్నాడు. వెకేషన్లంటూ తిప్పుకుని వస్తున్నాడు. మెగా సిస్టర్లంతా కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. ఇలా శ్రీజ బాధలన్నీ పోగొట్టేలా ఫ్యామిలీ అంతా ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది.

Sreeja Konidela latest emotional post viral
Sreeja Konidela

దీనిపై తాజాగా శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నా కష్టసుఖాల్లో తోడున్న అందరికీ థాంక్స్.. నేను కోపంలో ఉన్నప్పుడు నవ్వించారు. ఏడుస్తున్నప్పుడు భుజాన్ని అందించారు. నేను మాట్లాడాలని అనుకున్నప్పుడు విన్నారు. నాకు అండగా నిలబడినందుకు థాంక్స్. నా మాటలు వింటున్నందుకు థాంక్స్. నేను బాగా ఉన్నానా? అని యోగక్షేమాలు తెలుసుకుంటున్నందుకు థాంక్స్.. నా పిచ్చి మూడ్ వేరియేషన్స్‌ను భరిస్తున్నందుకు థాంక్స్.. నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.. ఇలాంటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరికినందుకు నేనెంతో లక్కీ అంటూ శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే శ్రీజ విడాకుల గురించి మాత్రం ఎవరికీ క్లారిటీ రావట్లేదు. వీరు ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now