Sreeja : శ్రీ‌జ ఎమోష‌నల్ పోస్ట్‌.. ఇంత స‌డెన్‌గా ఎందుకిలా ?

January 31, 2022 1:12 PM

Sreeja : చిరంజీవి కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌లు విడాకులు తీసుకుంటార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. పైగా శ్రీ‌జ త‌న పేరు చివ‌ర్లో త‌న భ‌ర్త పేరును తొల‌గించి ఆ మేర త‌న సోష‌ల్ ఖాతాల్లో మార్పులు చేసింది. దీంతోపాటు మెగా ఫ్యామిలీ ఇటీవ‌ల చాలా సంద‌ర్భాల్లో అంద‌రూ ఒక్క చోట చేరి ఎంజాయ్ చేశారు. కానీ ఎక్క‌డా క‌ల్యాణ్ దేవ్ క‌నిపించ‌లేదు. దీంతో శ్రీ‌జ‌, అత‌ను విడాకులు తీసుకోబోతున్నార‌నే అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. అవే వార్త‌లు ఇప్ప‌టికీ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై మెగా ఫ్యామిలీలో ఎవ‌రూ స్పందించ‌లేదు. క‌నీసం వార్త‌ల‌ను కూడా ఖండించ‌లేదు. దీంతో ఆ వార్త‌లు నిజ‌మేన‌ని అనుకుంటున్నారు.

Sreeja emotional post on instagram why suddenly this
Sreeja

ఇక తాజాగా శ్రీ‌జ త‌న అన్న రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ముంబైలో విహ‌రించింది. వారు ముంబై వీధుల్లో సంద‌డి చేశారు. ఈ క్ర‌మంలోనే వారు ముంబైలో విహ‌రిస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇక అదే ఫొటోను శ్రీ‌జ కూడా పోస్ట్ చేసింది. ఆ ఫొటో కింద కాప్ష‌న్ కూడా పెట్టింది.

Sreeja : భావోద్వేగ‌పూరిత‌మైన కాప్ష‌న్..

“హగ్స్ అండ్ క‌డిల్స్‌.. నేను బతకడానికి నాకు సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాలివే..” అని శ్రీ‌జ భావోద్వేగ‌పూరిత‌మైన కాప్ష‌న్ పెట్టింది. ఇక త‌న అన్న‌తో క‌లిసి దిగిన ఫొటోలో రామ్ చ‌ర‌ణ్ పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. అయితే శ్రీ‌జ ఈ విధంగా ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా ఎమోష‌న‌ల్ ఎందుకు అయింది ? ఆ పోస్టు ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింది ? అన్న వివ‌రాలు తెలియ‌డం లేదు. అలాగే వారు ముంబై ఎందుకు వెళ్లారు ? అనే విష‌యాన్ని కూడా వెల్ల‌డించ‌లేదు.

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)

నాగ‌చైత‌న్య నుంచి విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత కూడా ఇలాగే వైరాగ్య‌పు సందేశాల‌తో కూడిన పోస్టులు పెట్టింది. చూస్తుంటే శ్రీ‌జ కూడా ప్ర‌స్తుతం అదే బాధ‌లో ఉంద‌ని, అందుక‌నే ఇలాంటి ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టి ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి వీరి విడాకులు నిజ‌మేనా.. కాదా.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now