Soundarya : ఆయ‌న హీరో అన‌గానే నో చెప్పిన సౌంద‌ర్య‌.. కార‌ణం ఏమిటంటే..?

October 21, 2022 9:53 PM

Soundarya : బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, హాస్య నటుడిగా రాణించి, కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలీ. ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. అలీ కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం యమలీల. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, నటుడిగా అలీ స్టార్‌డమ్‌ ను పెంచింది. ఈ చిత్రం సంగీత పరంగానూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

1994 ఏప్రిల్‌ 28న విడుదలైన యమలీల ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భవిష్యవాణి చూసి తన తల్లి చనిపోతుందని తెలిసినప్పుడు అలీ నటనకు, హావభావాలు చూసి, ఆయనను కథానాయకుడిగా తీసుకోవద్దని చేపినవారు సైతం అలీ నటనకు హ్యాట్సాఫ్‌ చెప్పారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొద‌ట ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి సౌంద‌ర్య‌ను అనుకోవటం జరిగిందట. వెంటనే సౌంద‌ర్య వ‌ద్ద‌కు వెళ్లి క‌థ‌ను వినిపించ‌గా ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. కానీ క‌థ‌లో హీరోగా అలీ న‌టిస్తున్నార‌ని చెప్పగానే సౌంద‌ర్య సినిమా చేయ‌న‌ని చెప్పారట‌. సినీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో సౌంద‌ర్య తండ్రి వ‌ద్ద‌ని చెప్ప‌డం వ‌ల్లే  ఈ సినిమాకు సౌంద‌ర్య నో చెప్పారట.

Soundarya rejected yamaleela movie because of this reason
Soundarya

దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంద్ర‌జ అవకాశాన్ని దక్కించుకున్నారు.  1994 ఎప్రిల్ 28న ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చిన యమలీల చిత్రం అలీ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా త‌ర‌వాత అలీ శుభ‌ల‌గ్నం అనే సినిమాలో న‌టించారు. అయితే ఈ సినిమాలోని డ్యూయెట్ చినుకు చినుకు అందెల‌తో పాట కోసం సౌంద‌ర్య‌ను సంప్ర‌దించారు దర్శక నిర్మాతలు. ఈసారి మాత్రం సౌంద‌ర్య ఎలాంటి సందేహం లేకుండా వెంటనే  ఒప్పుకోవటం జరిగిందట. ఈ పాట అప్పటిలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now