Sonu Sood : శివ శంకర్ మాస్టర్ కు అండగా నిలిచిన రియల్ హీరో.. సోను సూద్!

November 25, 2021 2:45 PM

Sonu Sood : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గత నాలుగు రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే రోజురోజుకూ ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి పోతోంది. కరోనా బారిన పడటంతో శివ శంకర్ మాస్టర్ హైదరాబాద్‌ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఊపిరితిత్తులు ఇప్పటికే 75 శాతం ఇన్ఫెక్షన్ బారిన పడటంతో ఆయనకు రోజుకు లక్షల్లో ఖర్చు అవుతోంది. అయితే ఆయన చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు విషయంలో శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.

Sonu Sood helped shiva shankar master who is getting treatment

ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన చిన్న కుమారుడు తెలుపుతూ దాతలు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే రియల్ హీరో సోను సూద్ స్పందించారు. ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సోనుసూద్ ట్వీట్ చేస్తూ.. తాను ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడానని, ఆయనను రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. సోను సూద్ తెలిపారు. ఇలా ఆపదలో ఉన్నామని వేడుకోగానే వెంటనే స్పందించిన సోను సూద్ తీరుపై మరోసారి నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now