Sonu Sood : మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనుసూద్.. ఖమ్మం చిన్నారికి గుండె ఆపరేషన్..!

October 19, 2021 12:03 PM

Sonu Sood : కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది నిస్సహాయులకు నేనున్నానంటూ భరోసా కల్పించి, ఎంతోమంది ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలలో విలన్ పాత్రలో నటించే సోనుసూద్ నిజ జీవితంలో మాత్రం హీరోగా అందరి మదిలో నిలిచిపోయారు. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనుసూద్ తనకు సహాయం చేయమంటూ అభ్యర్థించిన వారందరికీ ఎంతో మంచి మనసుతో తనకు తోచిన సహాయం చేస్తున్నారు.

Sonu Sood again helped a baby boy who is facing problems with heart

తాజాగా సోనుసూద్ మరొక చిన్నారి విషయంలో కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంతోని చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు బాబు జన్మించాడు.
ఆ చిన్నారి పుట్టుకతోనే గుండె సమస్యతో బాధపడుతూ జన్మించడంతో బాబుకి ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ దంపతులు ఎంతో బాధ పడ్డారు.

అయితే వారికి అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో కృష్ణా జిల్లాలో ఉన్న జనవిజ్ఞాన ప్రతినిధులు తెలుసుకొని ఈ విషయాన్ని నటుడు సోనూసూద్ కు చేరవేశారు. ఈ క్రమంలోనే సోనుసూద్ స్పందిస్తూ ఖమ్మంలో నివసించే ఆ దంపతులను ముంబైకి రప్పించి అక్కడ మూడు నెలల బాబు సాత్విక్ కి గుండె ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కల్లూరు వాసులు సోనుసూద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now