Sobhita Dhulipala : నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ ట్రాక్‌.. క్లారిటీ ఇచ్చిన శోభిత ధూళిపాళ‌..

June 25, 2022 9:37 PM

Sobhita Dhulipala : గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో నాగ‌చైత‌న్య‌పై అనేక వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. నాగ‌చైత‌న్య.. న‌టి శోభిత ధూళిపాళ‌తో ల‌వ్‌లో ప‌డ్డాడ‌ని.. ఆమెతో అత‌ను రిలేష‌న్‌షిప్‌లోనూ ఉన్నాడ‌ని.. ఆమెను ఇప్ప‌టికే త‌న ఫ్యామిలీకి కూడా ప‌రిచ‌యం చేశాడ‌ని.. ఆమె ఉన్న హోట‌ల్‌కు చాలా సార్లు వెళ్లాడ‌ని.. ఇక త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటాడ‌ని.. అనేక వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు కూడా ఈ వార్త‌ల‌ను ప్ర‌చురించాయి. టీవీ చాన‌ల్స్‌లోనూ క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేశాయి. అయితే దీనిపై నాగ‌చైత‌న్య కానీ.. శోభిత కానీ స్పందించ‌లేదు. కానీ తాజాగా శోభిత త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్లకు ఒక వీడియో ద్వారా బ‌దులు చెప్పింది.

శోభిత ధూళిపాళ‌కు చెందిన ఓ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఆమె ఆ వీడియోలో త‌న మ‌ధ్య వేలును చూపించ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే దాన్ని త‌న‌పై వ‌స్తున్న పుకార్ల‌కు రిప్లైగా ప్ర‌చారం చేస్తున్నారు. ఆమె ఆ వీడియో రూపంలో బ‌దులిచ్చింద‌ని అంటున్నారు. త‌న‌పై లేని పోని వార్త‌లను ప్ర‌చారం చేస్తున్న వారంద‌రికీ అది వ‌ర్తిస్తుంద‌ని అన్న‌ట్లుగా ఆమె ఆ వీడియోను పోస్ట్ చేసింద‌ని అంటున్నారు. అయితే ఆ వీడియో నిజంగానే త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు రిప్లైగా ఆమె పెట్టిందా.. లేక పాత వీడియోనా.. అన్న విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త లేదు. కానీ ఆమె ఆ వార్త‌ల‌కు జ‌వాబుగానే ఆ వీడియోను పెట్టింద‌ని అంటున్నారు.

Sobhita Dhulipala given clarity on recent rumors
Sobhita Dhulipala

ఇక శోభిత ఇటీవ‌లే మేజ‌ర్ సినిమాతో మ‌రోమారు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ‌తంలో అడివి శేష్‌తో క‌లిసి ఈమె గూఢ‌చారి సినిమాలో న‌టించి రొమాన్స్ చేసింది. అయితే అప్ప‌ట్లో శేష్‌తో కూడా ఈమె ప్రేమాయణం న‌డిపించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో అలాంటి వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now