Sobhan Babu : తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకున్న స్టార్ హీరోలలో శోభన్ బాబు ఒకరు. అధికంగా కుటుంబ కథ చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలలో మంచి పేరు ఉన్న శోభన్ బాబు చదువు పూర్తయిన తరువాత సినిమాల మీద మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. శోభన్ బాబు మొదటిగా పొన్నులూరి బ్రదర్స్ నిర్మించిన దైవబలం చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం ఆశించిన మేరకు విజయం సాధించలేదు. ఆ తర్వాత భక్త శబరి చిత్రంలో నటించి సక్సెస్ ని అందుకున్నారు శోభన్ బాబు.
అప్పట్లో శోభన్ బాబు చిత్రాలు విడుదలవుతాయి అంటే చాలు మహిళా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. శోభన్ బాబు తెలుగుతోపాటు తమిళ ఇండస్ట్రీలో కూడా రాణించారు. అయితే ఆ సమయంలో జయలలిత, శోభన్ బాబు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు బాగా వినిపించేవి. జయలలిత, శోభన్ బాబు హీరో హీరోయిన్ లుగా డాక్టర్ బాబు అనే సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా డాక్టర్ బాబు.ఈ సినిమా షూటింగ్ కు కొన్ని రోజుల ముందు జయలలిత తల్లి మరణించారట. ఆ తరువాత జయలలిత తన తల్లిని శోభన్ బాబులో చూసుకుందట. ఈ విషయాన్ని శోభన్ బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
డాక్టర్ బాబు సినిమా షూటింగ్ ఊటీలో జరగగా శోభన్ బాబు, జయలలిత గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తన డైరీలో రాసుకున్నారు. అమ్మ మరణంతో బరువైన నా మనసును నీ జోకులతో తేలిక చేశావు. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు నిశ్చలంగా కనిపిస్తోంది. అందరితో మాట్లాడాలని కలిసి ఉండాలని అనిపిస్తుందని జయలలిత ఆయనతో చెప్పినట్టు శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నారు. అంతే కాకుండా నా తల్లి మరణించి సంవత్సరం కూడా కాలేదు. కానీ ఎన్నో సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది.
నా అనుకున్న వాళ్లు నాకు ద్రోహం చేశారు. బంధువులు కేవలం నా డబ్బు కోసమే ఉన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఇలా ఎన్నో బాధలకు మీరు వచ్చాక విముక్తి కలిగింది అంటూ జయలలిత శోభన్ బాబుతో చెప్పినట్లు తన డైరీలో రాసుకున్నారు. దాంతో వీరిద్దరి మధ్య ఉంది ప్రేమ కాదని ఒక తల్లి బిడ్డ లాంటి అనుబంధం అని డైరీలో శోభన్ బాబు రాసుకున్న వాక్యాలను బట్టి అర్థమవుతుంది. కానీ వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లనే శోభన్ బాబు, జయలలిత ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…