Sneha Ullal : పాపం స్నేహ ఉల్లాల్‌.. వ్యాధితో బాధ పడుతూ.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి..!

October 7, 2021 8:13 PM

Sneha Ullal : ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి స్నేహా ఉల్లాల్. ఈ సినిమా తరువాత మరో రెండు మూడు చిత్రాలలో నటించిన ఈమె దాదాపు తెలుగు తెరకు దూరం అయ్యి 7 సంవత్సరాలు కావస్తోంది. ఈ క్రమంలోనే ఏడు సంవత్సరాల తర్వాత స్నేహ ఉల్లాల్ మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుంది.

Sneha Ullal after long gap re entry into film industry

రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తోన్న ఎయిట్ అనే చిత్రానికి సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సప్తగిరి, స్నేహఉల్లాల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి స్నేహఉల్లాల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ క్రమంలోనే స్నేహఉల్లాల్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు తెరకు దూరం కావడానికి గల కారణాన్ని తెలియజేశారు.

తాను ఇన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణం.. తనకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాక కాదని, తను ఒక సుదీర్ఘమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే రక్తానికి సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నానని తెలియజేశారు. ఈ వ్యాధి పూర్తిగా తన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపడం వల్ల గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యానని.. ఈ సందర్భంగా స్నేహ ఉల్లాల్ తెలియజేశారు.

అయితే ఇంత సుదీర్ఘ కాలం తరువాత స్నేహ ఉల్లాల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టడంతో ఆమె ఒకప్పటిలా ఇండస్ట్రీలో సక్సెస్‌తో దూసుకుపోతుందా, లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now