Sneha : న‌టి స్నేహకు బెదిరింపులు.. పోలీసుల‌ని ఆశ్ర‌యించిన అల‌నాటి న‌టి..

November 18, 2021 9:06 PM

Sneha : ఒకప్పటి తెలుగు సినీ నటి, అందాల ముద్దుగుమ్మ స్నేహ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఈమె ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Sneha complained to police about her business issues

ప్రియమైన నీకు సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది స్నేహ. గ్లామర్ షో కోసం హద్దులు దాటకుండా.. సంప్రదాయంగా తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

తమిళంలో అచ్చాముందు అచ్చాముందు సినిమా షూటింగ్ సమయంలో కోలీవుడ్ హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి.. 2012లో వివాహం చేసుకుంది స్నేహ. పెళ్లి తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. తాజాగా స్నేహ ఇద్ద‌రు వ్యాపారవేత్త‌ల‌పై చెన్నైలోని కానత్తూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వడ్డీ చెల్లించమని అడిగినందుకు ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపింది.

చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్‌ ​కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ బిజినెస్‌ కోసం అప్పుగా 26 లక్షల రూపాయలు తీసుకొని, త‌న‌ను మోసం​ చేశారని, వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు స్నేహ ఫిర్యాదు చేసింది.

అలాగే తాను ఇచ్చిన రూ. 26 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. స్నేహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now