Skylab Movie Telugu 2021 Review : స్కైల్యాబ్ మూవీ రివ్యూ..!

December 4, 2021 1:27 PM

Skylab Movie Telugu 2021 Review : నిత్యమీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రల్లో న‌టించిన సినిమా స్కైల్యాబ్. డాక్టర్ కె.రవి కిరణ్ సమర్పణలో పృథ్వీ పిన్నమ రాజు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కాగా కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించ‌గా.. ఈ మూవీ శ‌నివారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ మూవీ ఎలా ఉంద‌న్న విష‌యానికి వ‌స్తే..

కథ: 1970ల‌లో జ‌రిగిన క‌థగా ఈ మూవీని తెర‌కెక్కించారు. అప్ప‌ట్లో తెలంగాణలోని బండలింగంపల్లి అనే గ్రామంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో చిత్ర క‌థ సాగుతుంది. ఈ మూవీలో గౌరి (నిత్య మీన‌న్‌) ఒక జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తుంటుంది. జ‌మీందార్ల వంశానికి చెందిన బిడ్డ అయిన‌ప్పటికీ సొంతంగా ఎద‌గాల‌నే తాప‌త్ర‌యం ఉంటుంది. అందుక‌నే ప్ర‌తిబింబం అనే ప‌త్రిక‌లో ప‌నిచేస్తూ ఎప్ప‌టికైనా స‌రే.. ర‌చ‌యిత్రిగా పేరు తెచ్చుకోవాల‌ని చూస్తుంటుంది. అదే గ్రామంలో డాక్ట‌ర్ (స‌త్య దేవ్‌) ఓ చిన్న క్లినిక్ పెట్టి సెటిల్ అవ్వాల‌ని చూస్తుంటాడు. అందుకు గాను సుబేదార్ రామారావు (రాహుల్ రామ‌కృష్ణ‌)తో క‌లిసి అనేక విధాలుగా ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఈ క్ర‌మంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు ఏమిటి ? అస‌లు వీరి జీవితాల్లో ఏమేం మార్పులు చోటు చేసుకున్నాయి ? చివ‌ర‌కు ఏం జ‌రిగింది ? అన్న వివ‌రాలు తెలియాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Skylab Movie Telugu 2021 Review know how is the movie

ఇక మూవీలో కొన్ని సీన్ల‌లో వ‌చ్చే సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. గ్రామాల్లో ఉండే ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని ఈ మూవీలో చ‌క్క‌గా చూపించారు. దీంతో స‌హ‌జ‌త్వం వ‌చ్చింది. ఇక జ‌ర్న‌లిస్టుగా నిత్య మీన‌న్‌, డాక్ట‌ర్‌గా స‌త్య‌దేవ్‌, సుబేదార్ రామారావుగా రాహుల్ రామ‌కృష్ణ‌లు చ‌క్క‌గా న‌టించారు. అలాగే మిగిలిన న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర బాగానే న‌టించారు. దీంతో సినిమాకు ఇవి ప్ల‌స్ పాయింట్స్‌గా మారాయి.

అయితే న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్ బాగున్న‌ప్ప‌టికీ క‌థ చాలా నెమ్మ‌దిగా ముందుకు సాగుతుంది. దీంతో కొంద‌రు ప్రేక్ష‌కుల‌కు బోర్ కొడుతుంది. అయితే చివ‌రి వ‌ర‌కు అలాగే బోరింగ్‌గా కథ కొన‌సాగడంతో ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల్ కాలేరు. అందువ‌ల్ల ఈ సినిమా యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఒక గ్రామీణ నేప‌థ్యం ఉన్న సినిమా క‌థ‌ను ప్ర‌శాంతంగా ఎంజాయ్ చేయాల‌నుకుంటే ఈ సినిమాను ఒక‌సారి చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now