Shiva Lingam : సృష్టి, స్థితి, లయ కారకులని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులని పిలుస్తామని అందరికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురిలోనూ చాలా మంది భక్తులు విష్ణువును, శివున్ని పూజిస్తుంటారు. ఇక మోక్షం కల్పించమని, మరుజన్మ ఉండొద్దని, కోరిన వరాలు తీర్చాలని శివుడికి పూజలు చేస్తుంటారు. అలాగే మరణ భయం ఉండొద్దని చెప్పి శివుడికి అభిషేకాలు కూడా చేస్తారు. అలాగే శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తారు. ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. అయితే శివున్ని భోళా శంకరుడని కూడా అంటారు. అడిగీ అడగగానే వరాలిస్తాడు కనుక శివున్ని అలా పిలుస్తారు.
ఇక శివ అంటే మంగళం అని కూడా అర్థం వస్తుంది. అంటే అన్నీ శుభాలనే అందించే దైవం అని అర్థం. కనుకనే సర్వ శుభంకరుడిగా శివున్ని పూజిస్తారు. అయితే చాలా మంది ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకుని పూజించాలని కోరుకుంటుంటారు. ఈ క్రమంలోనే అసలు ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకోవాలా.. వద్దా.. అని కూడా సందేహిస్తుంటారు. అయితే శివ లింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ అందుకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకుని పూజించవచ్చు. కానీ అది అంగుష్టమాత్రం పరిమాణంలో ఉండాలి. అంటే మన బొటన వేలి సైజు అన్నమాట. అంత పరిమాణంలో ఉండే శివలింగాన్నే ఇంట్లో పూజించాల్సి ఉంటుంది. అంతకన్నా సైజు మించరాదు.
ఇక రోజూ పూజలు చేస్తాం.. వేదమంత్రాలతో అభిషేకం చేస్తూ నియమ నిష్టలను పాటిస్తాం అనుకుంటే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. ఒకటి కాదు.. రెండు శివలింగాలనైనా పెట్టుకుని పూజలు చేయవచ్చు. కానీ నియమ నిష్టలు మాత్రం తప్పనిసరి. లేదంటే దోషం ఏర్పడుతుంది. దీంతో అశుభం జరుగుతుంది. అన్నీ సమస్యలే వస్తాయి. కనుక నియమ నిష్టలు పాటిస్తాం అనుకుంటేనే ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇక శివ లింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంటుంది. కనుక ఇంట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన చేయడం శ్రేయస్కరమని అంటుంటారు. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించాలి. ముఖ్యంగా శివునికి లింగార్చన చేసుకుంటే సర్వశుభం అనేది వాస్తవం. అయితే శుచి, శౌచం పాటించాలి. ఇక వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో (మట్టితో) అప్పటికప్పుడు పార్థివ లింగం తయారుచేసుకుని శివున్ని అర్చించవచ్చు. ఇలా శివున్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. నేరుగా కైలాసానికే చేరుకుంటారని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…