Doctor Movie Review : శివ‌కార్తికేయ‌న్‌ డాక్ట‌ర్ మూవీ రివ్యూ..!

October 9, 2021 5:04 PM

Doctor Movie Review : త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో న‌టుడు శివ‌కార్తికేయ‌న్‌కు మంచి పేరుంది. గ‌తంలో ఆయ‌న న‌టించిన చిత్రాలు హిట్ టాక్‌ను తెచ్చి పెట్టాయి. ఇక ఆయ‌న తాజాగా న‌టించిన చిత్రం డాక్ట‌ర్‌. ఈ మూవీ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఈ మూవీని బాగానే ఆద‌రిస్తున్నారు. ఇక ఈ మూవీలో శివ‌కార్తికేయ‌న్ ఎలా న‌టించాడు, క‌థ ఎలా ఉంది ? అన్న వివ‌రాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

sivakarthikeyan Doctor Movie Review

Doctor Movie Review : క‌థ‌..

వ‌రుణ్ (శివ కార్తికేయ‌న్‌), ప‌ద్మిని (ప్రియాంక‌)లు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటారు. కానీ ప‌ద్మిని ఇంట్లో ఒక చిన్నారి క‌నిపించ‌కుండా పోవ‌డంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. దీంతో వ‌రుణ్ ప‌ద్మినికి స‌హాయం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. ఇక త‌రువాత ఏమైంది ? అన్న‌దే క‌థ‌.

ఈ మూవీని మిస్ట‌రీ, థ్రిల్ల‌ర్‌, డార్క్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈ జోన‌ర్‌లో వ‌చ్చిన అనేక చిత్రాలు ఇప్ప‌టికే స‌క్సెస్ అయ్యాయి. అందువ‌ల్ల ద‌ర్శ‌కుడు నెల్స‌న్ చ‌క్క‌ని క‌థ‌ను ఎంచుకుని మూవీని తీశార‌ని చెప్ప‌వ‌చ్చు. థ్రిల్ల‌ర్ పేరు చెప్పిన‌ట్లుగానే ఈ మూవీ ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. త‌రువాత సీన్ ఏం జ‌రుగుతుందా ? అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా చూస్తారు. మానవ అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో చిత్ర క‌థ‌నం కొన‌సాగుతుంది.

ఈ జోన‌ర్ లో వ‌చ్చిన చిత్రాలు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఇక ఈ మూవీ కూడా క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆద్యంతం థ్రిల్లింగ్‌ను అందిస్తుంది క‌నుక ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఈ మూవీని ఒక‌సారి చూడ‌వ‌చ్చు.

ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌గా శివ కార్తికేయ‌న్ త‌మ సొంత బ్యాన‌ర్ శివ‌కార్తికేయ‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌పై ఈ మూవీని నిర్మించారు. ఎక్క‌డ చూసినా పాజిటివ్ టాక్ తో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now