Sithara Mahesh : సినిమా ఇండస్ట్రీకి వారసుల హవా కొత్తేమీ కాదు. కొందరు బాల నటులుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా, మరి కొందరు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ కూతురు అర్హ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార కూడా తెరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సితారకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. సితార టాలెంట్‌ని గుర్తించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రంలో సితారని ఓ కీలక పాత్రకు ఎంపిక చేయాలని భావిస్తున్నాడట. ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 26న తలపతి విజయ్ 66వ సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో విజయ్ కూతురి పాత్ర కోసం సితారను సంప్రదించారని తాజా సమాచారం.
మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. అలాగే వీరి కూతుళ్లు కూడా స్నేహితులు కావడంతో వంశీ పైడిపల్లి చాలా సార్లు సితారలోని టాలెంట్ ను గుర్తించాడు. ఈ క్రమంలోనే విజయ్ సినిమాలో సితారని తీసుకోవాలని అనుకుంటున్నాడట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…