Sithara Mahesh : మొన్న బ‌న్నీ కూతురు, రేపు మ‌హేష్ కూతురు.. వెండితెర ఎంట్రీ ఖాయ‌మా?

October 6, 2021 3:07 PM

Sithara Mahesh : సినిమా ఇండ‌స్ట్రీకి వార‌సుల హ‌వా కొత్తేమీ కాదు. కొంద‌రు బాల న‌టులుగా ఇండ‌స్ట్రీకి పరిచ‌యం అవుతుండ‌గా, మ‌రి కొంద‌రు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ కూతురు అర్హ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార కూడా తెరంగేట్రం చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

Sithara Mahesh Babu daughter may appear in film

సితార సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో సితార‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. సితార టాలెంట్‌ని గుర్తించిన ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి త‌న త‌దుప‌రి చిత్రంలో సితార‌ని ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక చేయాలని భావిస్తున్నాడ‌ట‌. ఇందుకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ 26న తలపతి విజయ్ 66వ సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాలో విజ‌య్ కూతురి పాత్ర కోసం సితారను సంప్రదించారని తాజా సమాచారం.

మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. అలాగే వీరి కూతుళ్లు కూడా స్నేహితులు కావడంతో వంశీ పైడిపల్లి చాలా సార్లు సితారలోని టాలెంట్ ను గుర్తించాడు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ సినిమాలో సితార‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now