Sitara Dance : సితార డ్యాన్స్‌కి ఫిదా అయిన మ‌హేష్ బాబు.. సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం..

January 31, 2023 1:22 PM

Sitara Dance : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారి చేసే ర‌చ్చ‌కి చాలా మంది ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. నిత్యం తనకు సంబందించిన ఫొటోస్, వీడియోలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ ఉంటుంది సితార‌. ‘సర్కారు వారి పాట‌’ సినిమా ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చిన సితార.. ఎప్పటికపుడు మహేష్ అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. తాజాగా తండ్రి మహేశ్‌ బాబు సాంగ్‌కు స్టెప్పులేసి అందరిచే ఔరా అనిపించింది. 2005లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు, త్రిష జంటగా వచ్చిన సినిమా అతడు ఎంత పెద్ద హిట్ అయిందో మ‌నంద‌రికి తెలిసిందే.

అత‌డు సినిమాలో ‘పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి..’ అనే పాటకు త్రిష వేసిన స్టెప్పులను ఎవరూ మర్చిపోలేరు. ఇదే పాటకు తాజాగా మహేష్ బాబు ముద్దుల కూతురు సితార స్టెప్స్ వేసి అలరించింది. అచ్చు త్రిష వేసిన మాదిరిగానే స్టెప్స్ వేసి సీతూ పాప అల‌రించింది.. సితార క్యూట్‌ డ్యాన్స్‌ వీడియోను సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోయారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది. సీతూ పాప హావభావాలకు మహేష్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

Sitara Dance mahesh babu very much impressed viral video
Sitara Dance

పదేళ్ల వయసున్న సితార రానున్న సంవత్సరాలలో ఘట్టమనేని వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ కూతురు చదువుతో పాటు సంగీతం, డ్యాన్స్ కూడా నేర్చుకుంటోంది. మరోవైపు సూపర్ స్టార్ వారసుడు గౌతమ్ కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘వన్- నేనొక్కడినే’ సినిమాలో గౌతమ్ నటించాడు. ప్రస్తుతం అతడు చదువుపై శ్రద్ద పెట్టాడు. రానున్న రోజుల‌లో వీరిద్ద‌రు కూడా వెండితెర‌పై అల‌రించే అవ‌కాశం ఉంది. మ‌హేష్ వారసులుగా వారు వెండితెర‌ని ఏల‌నున్నార‌ని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now