Samantha : సిద్ధార్థ్ సంచ‌ల‌న కామెంట్స్‌.. స‌మంత‌కు దిమ్మ‌తిరిగిపోయే షాక్‌..?

December 8, 2021 11:01 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. మై మామ్ సెయిడ్ అంటూ అనేక కోట్స్ పోస్ట్ చేస్తోంది. మ‌రోవైపు సినిమాల ప‌రంగా కూడా ఆమె ఎంతో బిజీగా ఉంది. ఇక ఇటీవ‌లే ఈమె తొలిసారిగా త‌న విడాకుల‌పై స్పందించింది. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ ఏడాది త‌న జీవితంలో ఎంతో క‌ష్టంగా గ‌డిచింద‌ని.. అత్యంత చేదు సంవ‌త్స‌రం ఇద‌ని, త‌న భ‌విష్య‌త్తుపై తాను ఓ ద‌శ‌లో ఆశ‌ల‌ను వ‌దులుకున్నాన‌ని తెలియ‌జేసింది.

siddharth shocking comments may be related to Samantha

ఎన్నో ఏళ్లుగా క‌ష్ట‌ప‌డి కెరీర్‌ను ఏర్పాటు చేసుకున్నాన‌ని స‌మంత తెలిపింది. 2021లో త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో చోటు చేసుకున్న ప‌లు సంఘ‌ట‌నల కార‌ణంగా త‌న క‌ల‌లు క‌ల్ల‌లు అయ్యాయ‌ని పేర్కొంది. దీంతో తాను ఎంతో కృంగిపోయాన‌ని, సోష‌ల్ మీడియాతో సెల‌బ్రిటీలు ఫ్యాన్స్‌కు ద‌గ్గ‌ర‌వుతార‌ని చెప్రింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు నెటిజ‌న్ల ప్రేమ‌, అభిమానాల‌ను పొందుతున్నాన‌ని చెప్పింది. వారు కూడా త‌న జీవితంలో భాగం అయ్యార‌ని తెలియ‌జేసింది.

అయితే కొంద‌రు త‌న‌కు స‌పోర్ట్‌ను ఇస్తుంటే.. కొంద‌రు మాత్రం త‌న‌ను ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నార‌ని, కొంద‌రు అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్స్ చేస్తున్నార‌ని చెబుతూ విచారం వ్య‌క్తం చేసింది. త‌న‌ను విమ‌ర్శించే వాళ్ల‌ను ఒక్క‌టే కోరుతాన‌ని.. తాను చేసే ప్ర‌తి ప‌నినీ అంగీక‌రించాల‌ని చెప్పింది. అయితే త‌న అభిప్రాయాలు అనేవి న‌చ్చ‌క‌పోతే వాటిని ఒక ర‌కంగా చెప్ప‌వ‌చ్చ‌ని, కానీ త‌న‌ను తిట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. ఈ సంవ‌త్స‌రంలో త‌న క‌ల‌లు చెదిరిపోయాన‌ని, వ‌చ్చే సంవ‌త్స‌రంపై ఎలాంటి ఆశ‌లు లేవ‌ని, నా జీవితంలో ఏది జ‌ర‌గాల‌ని రాసి పెట్టి ఉంటే అదే జ‌రుగుతుంద‌ని స‌మంత తెలియ‌జేసింది.

అయితే స‌మంత చెప్పిన విష‌యాల‌పై న‌టుడు సిద్ధార్థ్ ప‌రోక్షంగా ఘాటుగా రిప్లై ఇచ్చారు. నేటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు సెల‌బ్రిటీలు.. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధాలుగా మార్చడానికి ఎన్నో కోట్ల రూపాయల‌ను ఖర్చు చేస్తున్నార‌ని, అయితే ఏదీ దానంతట అదే జరగద‌ని, చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారనే విష‌యాన్ని హీరోహీరోయిన్లు అర్ధం చేసుకోవాల్సి ఉంటుంద‌ని.. అన్నాడు.

ఇక నుంచైనా.. ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోకండి.. అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ క్ర‌మంలో సమంత‌ని ఉద్దేశించే సిద్దార్థ .. ఈ విధంగా కామెంట్స్ చేసి ఉంటాడ‌ని ప‌లువురు అంటున్నారు. స‌మంత డ‌బ్బులిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంద‌ని, ఇప్పుడు ఆ ఫ్యాన్సే ఆమెను విమర్శిస్తున్నార‌ని.. సిద్ధార్థ్ ప‌రోక్షంగా అన్నాడు. ఈ క్ర‌మంలో వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now