Siddharth: సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న తరువాత చాలా మంది రకరకాలుగా స్పందించారు. అయితే నటుడు సిద్ధార్థ్ కూడా స్పందించారు. ఆయన పరోక్షంగా ట్వీట్ పెట్టారు. మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్‌లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే.. మరి మీరేం నేర్చుకున్నారు.. అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.
అయితే సమంత విడాకుల తరువాత సిద్ధార్థ్ ఈ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో సమంత, సిద్ధార్థ్‌కు మధ్య ప్రేమాయణం నడిచిందని, తరువాత కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే సమంత మోసం చేయడం వల్లే సిద్ధార్థ్ ఆ విధంగా ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేశాడని అందరూ అనుకున్నారు. దీంతో ఈ విషయం రచ్చ రచ్చ అయింది.
అయితే సమంత విడాకుల అనంతరం తాను చేసిన ట్వీట్ పై సిద్ధార్థ స్పందించారు. తాను ఎవరినో ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని, తన జీవితంలో జరిగిందే తాను ట్వీట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ ట్వీట్‌ను ఎవరో తన గురించి అనుకుంటే తాను ఏమీ చేయలేనని వ్యాఖ్యానించాడు. తన ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే.. తాను దాని గురించి ట్వీట్ చేశానని.. దానికి ఎవరో బాధపడితే తనకు సంబంధం ఏంటి ? అని సిద్ధార్థ్ అన్నాడు. అయితే సిద్ధార్థ్ ఈ విధంగా క్లారిటీ ఇవ్వడం సంచలనంగా మారింది. తాను సమంతపై ట్వీట్ చేశానని, కానీ దాన్ని ఆమె గురించి చేయలేదని, సిద్ధార్థ్ చెప్పకనే చెప్పినట్లు అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…