Siddharth: ఎవ‌రో ఏదో అనుకుంటే నేనేం చేస్తాను.. సిద్ధార్థ్ మ‌ళ్లీ మంట పెట్టాడు..

October 8, 2021 9:29 PM

Siddharth: స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకున్న త‌రువాత చాలా మంది ర‌క‌ర‌కాలుగా స్పందించారు. అయితే న‌టుడు సిద్ధార్థ్ కూడా స్పందించారు. ఆయ‌న ప‌రోక్షంగా ట్వీట్ పెట్టారు. మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్‌లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే.. మరి మీరేం నేర్చుకున్నారు.. అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.

Siddharth given clarity over his previous tweet

అయితే స‌మంత విడాకుల త‌రువాత సిద్ధార్థ్ ఈ ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఎందుకంటే గ‌తంలో స‌మంత‌, సిద్ధార్థ్‌కు మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డిచింద‌ని, త‌రువాత కొన్ని కార‌ణాల వ‌ల్ల వారు విడిపోయార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే స‌మంత మోసం చేయ‌డం వ‌ల్లే సిద్ధార్థ్ ఆ విధంగా ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేశాడ‌ని అంద‌రూ అనుకున్నారు. దీంతో ఈ విష‌యం ర‌చ్చ రచ్చ అయింది.

అయితే స‌మంత విడాకుల అనంత‌రం తాను చేసిన ట్వీట్ పై సిద్ధార్థ స్పందించారు. తాను ఎవరినో ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని, తన జీవితంలో జరిగిందే తాను ట్వీట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఆ ట్వీట్‌ను ఎవరో తన గురించి అనుకుంటే తాను ఏమీ చేయలేనని వ్యాఖ్యానించాడు. తన ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే.. తాను దాని గురించి ట్వీట్ చేశానని.. దానికి ఎవరో బాధపడితే తనకు సంబంధం ఏంటి ? అని సిద్ధార్థ్ అన్నాడు. అయితే సిద్ధార్థ్ ఈ విధంగా క్లారిటీ ఇవ్వడం సంచలనంగా మారింది. తాను సమంతపై ట్వీట్‌ చేశానని, కానీ దాన్ని ఆమె గురించి చేయలేదని, సిద్ధార్థ్ చెప్పకనే చెప్పినట్లు అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment