Shyam Singha Roy : నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి లేటెస్ట్ బజ్.. సినిమా విడుదల అయ్యేది అప్పుడే..!

October 18, 2021 9:45 PM

Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో నాని ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే దసరా కానుకగా కాళీ మాత ఆలయంలో శ్యామ్ సింగ రాయ్ ని చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది.

Shyam Singha Roy latest buzz movie releasing on that date

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివర క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. నాని, సాయి పల్లవి జంటగా ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now