Shweta Tiwari : దేవుడికి, బ్రాకు ముడిపెట్టి వ్యాఖ్యలు చేసిన శ్వేత తివారీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

January 28, 2022 9:51 AM

Shweta Tiwari : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది. బాలీవుడ్‌లో అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా నటి శ్వేత తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలపై ఓ వర్గం వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా సందడి చేస్తున్న శ్వేత తివారీ.. హమ్‌ తుమ్‌ అండ్‌ దెమ్‌.. మేరీ డాడ్‌కీ దుల్హన్‌ సీరియల్స్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో చివరకు పోలీస్‌ కేస్‌ వరకు విషయం వెళ్లింది.

Shweta Tiwari objectionable comments on god lands in trouble

శ్వేత తివారీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆమె కొంప ముంచాయి. తన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ షో స్టాపర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దేవుడిని ఉద్దేశించి అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసింది.

ప్రెస్‌ మీట్‌లో భాగంగా శ్వేత తివారీ మాట్లాడుతూ.. దేవుడు తన బ్రా కొలతలు తీసుకుంటున్నాడని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వ్యాఖ్యలపై అందరూ మండిపడుతున్నారు. దేవుడిపై ఇలా అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయొచ్చా.. అని ప్రశ్నిస్తున్నారు.

అయితే శ్వేత తివారీ తరువాత తన వ్యాఖ్యలకు సారీ చెప్పింది. కానీ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఆమె వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె మాట్లాడిన మాటలకు చెందిన వీడియో కూడా వైరల్‌ అయింది. దీంతో ఆమెకు గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా మారింది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now