Shruti Haasan : అవును.. అలా చేశా.. అయితే ఏంటి..?

October 14, 2022 3:51 PM

Shruti Haasan : లోకనాయకుడు కమల్‌హాసన్‌ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా యాక్టింగ్‌, అందచందాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ శ్రుతి హాసన్. కెరీర్‌లో మధ్య గ్యాప్ తీసుకున్న గతేడాది జనవరిలో మాస్ మాహారాజా రవితేజ క్రాక్ మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే శృతిని కెరీర్ ప్రారంభంలో న‌టించిన చిత్రాలన్నీ వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఐర‌న్ లెగ్ అని ముద్ర ప‌డింది. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది.

ఆ తర్వాత వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా శృతి హాసన్ తన బాడీ గురించి ఒక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసింది. కొన్నేళ్లుగా శృతి హాసన్ ముక్కు విభిన్నంగా సన్నగా కనిపిస్తోంది. ఆమె ప్రారంభ చిత్రాల్లో ఉన్నట్లు ఇప్పుడు ముక్కు లేదు. దీనితో శృతి హాసన్ అందం కోసం ముక్కుకి సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం జరిగింది. దీని గురించి శృతి హాసన్ తాజాగా ఇంటర్వ్యూలో బదులిచ్చింది.

Shruti Haasan admitted she has done treatment
Shruti Haasan

నిజమే.. నా ముక్కుకి సర్జరీ జరిగింది. అయితే దీని గురించి నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవం చెప్పాలి. అంతా అనుకున్నట్లు నేను అందం కోసం సర్జరీ చేయించుకోలేదు. నా ముక్కుకి గాయం అయింది. దీనితో తప్పని పరిస్థితుల్లో సర్జరీ జరిగింది. అందువల్లే నా ముక్కు మునుపటిలా లేదు అని శృతి హాసన్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో క్రేజీ చిత్రాలు ఉన్నాయి. బాలకృష్ణ సరసన గోపీచంద్ మలినేని చిత్రంలో, చిరంజీవి సరసన డైరెక్టర్ బాబీ చిత్రంలో, ప్రభాస్ సరసన సలార్ చిత్రాల్లో శృతి హాసన్ నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now