Shriya : శ్రియ కుమార్తెకు రాధ అని పేరు పెట్టడం వెనుక పెద్ద క‌హానీ ఉందే..!

October 19, 2021 2:45 PM

Shriya : టాలీవుడ్ సినీ నటి శ్రియకు రీసెంట్ గా పాప పుట్టిన విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఈమె గతేడాది పాపకు జన్మనిచ్చింది. దీంతో శ్రియ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తన లైఫ్ లో జరిగిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకుంది. నటి శ్రియ భర్త ఆండ్రీ కోస్చేవ్ తన పాపకు రాధ అనే పేరుని పెట్టారని కూడా తెలిపింది.

Shriya told why she named radha for her daughter

అయితే ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటో శ్రియ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. శ్రియ‌.. మా అమ్మకు ఒక అమ్మాయి పుట్టిందని చెప్పినప్పుడు.. ఓహ్ రాధా రాణి వస్తోందని అన్న‌ద‌ట. అలా ఆండ్రీ.. ఓహ్ మీ అమ్మ నిజంగా సంతోషంగా ఉందని అన్నాడ‌ట. అప్పుడు శ్రియ భర్త ఆమెను రష్యన్ పేరుతో ఎందుకు పిలుస్తున్నారని అడిగితే.. రాధ అంటే రష్యన్ లో సంతోషంగా ఉందని అర్థం. అందుకే శ్రియ దంపతుల కుమార్తెకు రాధ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అలాగే తన పూర్తి పేరు రాధా సరన్ కోస్చివ్ అని అన్నారు.

రాధ అంటే రష్యన్ భాషలో సంతోషంగా ఉంది.. అలాగే సంస్కృతంలో కూడా సంతోషంగా ఉందనే మీనింగ్ వస్తుందని అన్నారు. అలాగే తమ పాపను అలా పిలుచుకోవడం ఇంకా సంతోషంగా ఉందని శ్రియ తెలిపింది. అలాగే డెలివరీ కూడా చాలా సులువుగా అయ్యిందని, రాధ పుట్టినప్పుడు తన తల్లి తనతోనే ఉందని శ్రియ తెలియ‌జేసింది. డెలివరీ అయ్యాక చేసే ప్రతి పని పట్ల, చేసే వారి పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని చెప్పింది. అలాగే ప్రతిరోజు తాను త‌న‌ గురించి ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకుంటాన‌ని తెలిపింది. ప్రస్తుతం శ్రియ పలు సినిమాల్లో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now