Shriya Saran : హవ్వా.. అందరూ అందరూ చూస్తుండగానే.. వేదికపై తరుణ్ తో అలా బిహేవ్ చేసిన శ్రియ‌..

October 12, 2022 9:23 PM

Shriya Saran : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు అవుతుంది. అతను దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం నువ్వే నువ్వే. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 వ సంవత్సరం అక్టోబర్ 10న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓ తండ్రికి, కూతురికి మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్.. అయితే కూతురి ప్రేమ వల్ల వీరి మధ్య ఏర్పడిన సమస్యల చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో, ఎమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో, అద్భుతమైన డైలాగులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.

ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు టీమ్. ఈ సందర్భంగా ఈవెంట్ లో హీరో తరుణ్ తో పాటు శ్రియా, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, మరియు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సదర్భంగా శ్రియా మాట్లాడుతూ.. ఇంత మంచికథను అందించి.. మంచి సినిమాను మాతో తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఇక ప్రకాశ్ రాజ్ నిజంగా నా పేరెంట్స్ ను మరిపించారు. మీతో నటించడం నాకు గౌరవంగా ఫీల్ అవుతున్నాను అన్నారు శ్రియ. ఈ క్రమంలోనే హీరో తరుణ్ ను ఆకాశానికెత్తింది శ్రియ. తను అమేజింగ్ కో ఆర్టిస్ట్ అని పొగడ్తలతో ముంచెత్తింది.

Shriya Saran with Tarun and Trivikram about their movie
Shriya Saran

అందరూ చూస్తుండగానే తరుణ్ ను గాఢంగా ముద్దాడింది శ్రియ. ఈ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు. ఇక తరుణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా నిన్న మొన్న చేసినట్టుంది. అప్పుడే 20 ఏళ్లు అయ్యాయంటే నమ్మబుద్ది కావడం లేదు అన్నాడు. హీరోగా నా ఫస్టు మూవీకి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాశారు. డైరెక్టర్ గా ఆయన ఫస్టు సినిమాకి హీరోగా నేను చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎంతమంది హీరోలతో చేసినా ఆయన ఫస్టు హీరో మాత్రం నేనే. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళితే, నువ్వే నువ్వే లాంటి సినిమా ఇంకొక్కటి చేయండి అని అడుగుతూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now