Shriya Saran : ఎవరికైనా మాతృత్వం పొందడంలో చాలా గొప్ప అనుభూతి ఉంటుంది. టాలీవుడ్ హీరోయిన్ శ్రియ కూడా ఇప్పుడు ఆ అనుభూతిని ఆస్వాదిస్తోంది. తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ.. ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని.. తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ వరకూ అందరితోనూ నటించిన శ్రియ 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్ళాడి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అయితే అతనితో నానా రచ్చ చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తన భర్తతో వివిధ ప్రాంతాలకు షికార్లకు వెళుతూ అక్కడ హాట్ యాంగిల్స్‌లో ఫోటోలు దిగుతూ.. వాటిని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. ఇలా ఆమె షేర్ చేసిన ఫోటోలు పలు మార్లు ఆమెను విమర్శల పాలు కూడా చేశాయి.
శ్రియ రీసెంట్‌గా పండంటి కూతురికి జన్మనిచ్చినట్టు పేర్కొంది. 2020లో అందరూ కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కోగా.. తనకు మాత్రం దేవుడు మరిచిపోలేని ఓ బహుమతిని ఇచ్చాడని ఆమె తెలిపింది. ఓ ఏంజిల్ లాంటి చిన్నారి తమ జీవితంలోకి వచ్చిందంటూ ఆమె పేర్కొంది. ఆమె పేరు రాధ అని పెట్టినట్టు కూడా తెలిపింది. అయితే శ్రియ కొద్ది రోజుల క్రితం ముంబైకి రాగా, అక్కడ వీధుల్లో తన కూతురిని భుజంపై కూర్చోపెట్టుకొని పండ్లు కొంటోంది. పార్క్‌లలో చక్కర్లు కొడుతోంది. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…