Akhil Akkineni : అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ మంచి హిట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. నేడు విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం పక్కా హిట్ అవుతుందనే ఆలోచనలో టీం ఉంది. గత కొద్ది రోజులుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న అఖిల్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన ఫోన్‌లో అక్కినేని ఫొటో స్క్రీన్‌పై ఎప్పుడూ ఉంటుందని తెలియజేశాడు.
ఇక తాజాగా ఓ వ్యక్తి పేరుని గాడ్ ఫాదర్‌గా సేవ్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి అల్లు అరవింద్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూసుకున్నారు. ఆయన చూపించిన ప్రేమానురాగాలను మరిచిపోలేను. నాకు తప్పకుండా హిట్ ఇవ్వాలనే ఒక తపనతో బన్నీ వాసుతో కలిసి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నా ఫోన్ లో ఆయన నంబర్ ను ‘గాడ్ ఫాదర్’ అనే పేరుతోనే ఫీడ్ చేసుకున్నాను.. అని అఖిల్ పేర్కొన్నాడు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించింది. ప్రేమలో ఉన్నప్పుడు మనసు ఏది ఆశపడుతుంది ? పెళ్లి తరువాత మనసు ఏం ఆశిస్తుం ది? అనే ఇంట్రెస్టింగ్ లైన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం బాగానే ఉందనే టాక్స్ వినిపిస్తున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…