Shriya Saran : గ‌ర్భంతో ఉన్న‌ప్ప‌టి వీడియోను షేర్ చేసిన శ్రియ‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

April 22, 2022 9:47 PM

Shriya Saran : టాలీవుడ్ న‌టి శ్రియ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది ఆర్ఆర్ఆర్‌లో ఆమె పాత్ర గురించి కాదు. ఆమె స‌డెన్‌గా ఓ వీడియోను పోస్ట్ చేసింది. దాని గురించే ఇప్పుడు చ‌ర్చంతా న‌డుస్తోంది. ఆ వీడియోను ఫ్యాన్స్ చూసి మైమ‌రిచిపోతున్నారు. ఆమె గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు బేబీ బంప్‌తో తీసిన వీడియో అది. అందులో ఆమె ఎంతో అందంగా క‌నిపిస్తోంది. అయితే ఆమెకు ప్ర‌స్తుతం కుమార్తె జ‌న్మించింది. ఈ క్ర‌మంలోనే ఆ పాత వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Shriya Saran shared throwback video
Shriya Saran

ఈ వీడియోకు శ్రియ ఓ కాప్ష‌న్ కూడా పెట్టింది.2020 లుకింగ్ బ్యాక్ అని కామెంట్ చేసింది. అయితే శ్రియ గ‌ర్భంతో ఉన్న విష‌యం కూడా ఎవ‌రికీ తెలియదు. అంత‌టి టాప్ సీక్రెట్‌ను ఈమె మెయింటెయిన్ చేసింది. ఇక చివ‌రిగా త‌న కుమార్తెను చూపిస్తూ ఈమె త‌న‌కు పుట్టింద‌ని తెలిపింది. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ షాక‌య్యారు. కాగా శ్రియ ర‌ష్యాకు చెందిన ఆండ్రె కొశ్చివ్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. అప్ప‌టి నుంచి ఆమె ర‌ష్యాలోనే ఎక్కువ‌గా ఉంటోంది. అప్పుడ‌ప్పుడు సినిమాల కోసం ఇండియాకు వ‌స్తోంది. 2021లో ఆమెకు కుమార్తె జ‌న్మించింది.

శ్రియ ప్ర‌స్తుతం త‌న‌కు ఖాళీ స‌మ‌యం లభిస్తే చాలు.. కుమార్తెతోనే ఎక్కువ‌గా కాలం గ‌డుపుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న కుమార్తెతో ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోల‌ను కూడా షేర్ చేస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్‌లో శ్రియ రామ్ చ‌ర‌ణ్‌కు త‌ల్లిగా నటించింది. అయిన‌ప్ప‌టికీ ఆమె పాత్ర‌పై ప్రేక్ష‌కులు పాజిటివ్‌గానే స్పందించారు. ఇక శ్రియ ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. తడ్కా, న‌ర‌గ‌సూర‌న్‌, క‌బ్జా వంటి చిత్రాల్లో ఆమె న‌టిస్తోంది. ఇవి రానున్న రోజుల్లో విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now