Shriya Saran : అది ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శ్రియ‌..!

September 12, 2022 1:58 PM

Shriya Saran : సౌత్ ఇండియాను దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్. మంచి నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి. 2001లో విడుదలైన ఇష్టం ఆమె ఫస్ట్ మూవీ. అది హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. 2002లో విడుదలైన సంతోషం మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది శ్రియా. అదే ఏడాది చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే ఇలా వరుస హిట్స్.. దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హోదాను తెచ్చిపెట్టాయి. తద్వారా హ్యుజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది.

అంతేకాదు సినిమాల ద్వారా ఈ అమ్మడు బోలెడన్ని కోట్లు సంపాదించిందట. నిజానికి యంగ్ హీరోయిన్స్ డబ్బుని దుబారా చేస్తారని ఓ టాక్ ఉంది. కానీ శ్రియా అలా కాదు.. వచ్చిన డబ్బులను వచ్చినట్లు పెట్టుబడులు పెడుతూ.. బిజినెస్ చేస్తూ వాటిని డబుల్ చేసిందట. ప్రస్తుతం తిని కూర్చున్నా తరగని ఆస్తి శ్రియాకి ఉందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇదే విషయంపై శ్రియాని ప్రశ్నించగా.. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరు గౌరవించ‌రని.. డబ్బులు ఉంటేనే పనులు జరుగుతాయని.. అందుకే డబ్బే ముఖ్యమని తెలుసుకొని కష్టపడి సంపాదించుకున్నాన‌ని తెలియ‌జేసింది.

Shriya Saran sensational comments on money
Shriya Saran

ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నానని.. ప్రస్తుతం భర్త, పాపతో హ్యాపీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రియా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిసింది. ఇటీవల శ్రియా ప్రధాన పాత్రలో గమనం పేరుతో ఓ మూవీ విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ప్రస్తుతం కన్నడలో శ్రియా ప్రధాన పాత్రలో నటించిన కబ్జా మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చేతినిండా ఆఫర్స్ తో శ్రియా కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొన‌సాగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now